శ్రీలీల కోసం అన్నీ అలాంటి కథలే.. టీనేజీ వైబ్స్‌ని ఆ కోణంలోనే చూస్తున్నారా?
దీనికి తోడు బాలీవుడ్లో సిద్ధార్థ్ గుప్తా హీరోగా, ఉమేష్ బిస్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో ప్రాజెక్ట్ కూడా రొమాంటిక్ థ్రిల్లర్ కావడం విశేషం.
By: Sivaji Kontham | 17 Oct 2026 10:00 PM ISTటాలీవుడ్ టాలెంటెడ్ కథానాయిక శ్రీలీలకు తెలుగులోనే కాకుండా పొరుగు పరిశ్రమల్లో కూడా అపారమైన ఫాలోయింగ్ ఉంది. అయితే ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ చేస్తున్న ప్రాజెక్ట్‌లను పరిశీలిస్తే, దర్శకరచయితలు తన కోసం ప్రధానంగా ప్రేమకథలనే ఎంచుకుంటున్నారనే ఆసక్తికరమైన చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో నడుస్తోంది. అటు టాలీవుడ్‌లోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీకి వరుసగా రొమాంటిక్ కథాంశాలే ఆఫర్ చేవడం వెనుక తన ఎనర్జిటిక్ ఇమేజ్- క్యూట్ టీనేజీ లూక్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
శ్రీలీల నటనాభినయం.. ముఖ్యంగా తన ఎనర్జిటిక్ డాన్సుల్లో తరగని ఉత్సాహం.. స్పష్టమైన టీనేజ్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. యువతను ఆకట్టుకునేలా ఉన్న గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్, అమాయకత్వంతో కూడిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఈ బ్యూటీని పర్ఫెక్ట్ రొమాంటిక్ లీడ్‌గా నిలబెడుతున్నాయి. దాంతో ఒక క్యూట్ లవ్ స్టోరీకి లేదా రొమాంటిక్ ఫిల్మ్‌కి కావలసిన స్పార్క్ శ్రీలీలలో మెండుగా ఉందనే భావనకు దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు. ఈ కారణంగానే ఎక్కువగా ప్రేమకథల కోణంలోనే చూస్తూ, అటువంటి పాత్రలనే శ్రీలీలకు ఆఫర్ చేస్తున్నారు.
బాలీవుడ్ ఎంట్రీ విషయంలోనూ శ్రీలీలకు ఇదే కేటగిరీ ప్రాజెక్ట్‌లు దక్కడం గమనార్హం. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు రూపకల్పనలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల ఒక మ్యూజికల్ లవ్ స్టోరీలో నటిస్తోంది. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో వీరిద్దరి లవ్ ట్రాక్ ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే షేర్ చేసిన ఫోటోల ద్వారా స్పష్టమవుతోంది. శ్రీలీల హిందీ అరంగేట్రం ఒక భారీ రొమాంటిక్ ఎంటర్టైనర్తో జరగడం తన టీనేజీ వైబ్ ఇమేజ్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
దీనికి తోడు బాలీవుడ్లో సిద్ధార్థ్ గుప్తా హీరోగా, ఉమేష్ బిస్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో ప్రాజెక్ట్ కూడా రొమాంటిక్ థ్రిల్లర్ కావడం విశేషం. జాన్వీ కపూర్, శ్రీలీల ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడటం అనే ప్రధాన ప్రేమ కథాంశంతో కథ నడుస్తుంది. గతంలో టాలీవుడ్లో చేసిన పలు చిత్రాల్లోనూ ప్రేమ సన్నివేశాలు, యూత్‌ఫుల్ లవ్ ట్రాక్సే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు హిందీలో వస్తున్న ఈ కొత్త ఆఫర్లు కూడా అదే కేటగిరీకి చెందడం శ్రీలీలకు లవ్ స్టోరీస్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయని నిరూపిస్తోంది.
మొత్తానికి శ్రీలీల తన డాన్స్ ఎనర్జీతో, ప్రొఫెషనల్ యాక్టింగ్‌తో శరవేగంగా పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే కేవలం ప్రేమకథలకే పరిమితం కాకుండా మునుముందు వైవిధ్యమైన, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలను ఎంచుకోవడం ద్వారా తనలోని నటనా వైవిధ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకే తరహా రొమాంటిక్ లీడ్ పాత్రల్లో టైప్ కాస్ట్ కాకుండా.. భిన్నమైన జానర్లను స్వీకరిస్తేనే నటిగా ఈ యంగ్ బ్యూటీ ప్రయాణం సుదీర్ఘంగా..మరింత విజయవంతంగా సాగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
