'ఆషీకీ 3' లో శ్రీలీల రీ-ఎంట్రీ!
ట్యాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ కెరీర్ పై ఎంత సీరియస్ గా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అమ్మడు రెండు..మూడు ప్రాజెక్ట్ ల్ని లాక్ చేసింది.
By: Srikanth Kontham | 15 Aug 2026 6:01 PM ISTట్యాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ కెరీర్ పై ఎంత సీరియస్ గా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అమ్మడు రెండు..మూడు ప్రాజెక్ట్ ల్ని లాక్ చేసింది. వాటిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఆషీకీ 3' లో అమ్మడు హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో శ్రీలీల పాత్ర ఎంతో కీలమైంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తయింది. అనంతరం యూనిట్ షూటింగ్ కి కొంత బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై కొత్త షెడ్యూల్‌లో శ్రీలీల తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం.
ముంబైలోని ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్‌లో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇందులో కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, కొన్ని మ్యూజికల్ సాంగ్స్ షూటింగ్‌ను యూనిట్ తెరకెక్కిస్తోంది. సెట్స్‌లోకి శ్రీలీల తిరిగి గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వడంతో సందడి వాతావరణం నెలకొంది. కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల జోడీ చూడచక్కగా ఉందని, ఇద్దరి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం లో రొమాన్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన సంగీతానికి పెద్దపీట వేసి రూపొందిస్తున్నారు.
విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా ప్రేక్షకులకు అద్భుతమైన దృశ్యకావ్యంగా సినిమా ఉండబోతుందని ప్రేక్షకులు అంచనా అంచనా వేస్తున్నారు. సినిమాలో పాత్ర కోసం శ్రీలీల ప్రత్యేకంగా నటనలోనూ, లుక్స్ పరంగానూ ఎంతో శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల బాలీవుడ్ బాట పట్టడం అమ్మడి కెరీర్‌లో మరో మైలురాయిగా మారుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన అమ్మడు హిందీ పరిశ్రమలో కూడా సత్తా చాటేందుకు ఈ సినిమాను బలమైన వేదికగా మలుచుకుంటున్నారు.
అనురాగ్ బసు టేకింగ్ స్టైల్ శ్రీలీల ప్రతిభకు మరింత వన్నె తెస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
ముంబై షెడ్యూల్ షురూ కావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఈ కాంబినేషన్‌కు సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. చిత్ర యూనిట్ కూడా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి గ్లింప్స్ .. టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో శ్రీలీల శ్రద్దా కపూర్ తరహాలో ఫేమస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సినిమా పూర్తిగా యూత్ టార్గెట్ గా తెరకెక్కుతోంది. జెన్ జీ యువతకు కనెక్ట్ అయ్యేలా అనురాగ్ బసు స్క్రిప్ట్ ను మలిచారు. సినిమా విజయంలో వారిదే కీలక పాత్ర కావడంతో యువత ఎలాంటి అంశాలను ఆశీస్తుందో వాటన్నింటిని మేళవించి ఎమోషనల్ గాను కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా సరైన లవ్ క్లాసిక్ లవ్ స్టోరీ రిలీజ్ అయి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో `ఆషీకీ 3` పై అంచనాలు అంతకంతకు పెరిగి పోతున్నాయి.
