అసలైన రాధా.. పుత్తడి బొమ్మలా ఆకట్టుకుంటున్న శ్రీ లీల!
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హీరోయిన్స్ ఒక్కొక్కరిగా రాధా గా మారిపోయి తమ అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
By: Madhu Reddy | 7 Sept 2026 11:59 AM ISTశ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హీరోయిన్స్ ఒక్కొక్కరిగా రాధా గా మారిపోయి తమ అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణాష్టమి పూర్తయి రెండు మూడు రోజులవుతున్న సోషల్ మీడియాలో మాత్రం ఆ వైబ్ ఇంకా తగ్గట్లేదు అని చెప్పాలి. మొన్నటికి మొన్న రాధగా మారి అనసూయ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు పువ్వుల మధ్యలో పుత్తడి బొమ్మలా.. కృష్ణుడికై వేచిచూసే రాధలా అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీ లీల.
అందులో భాగంగానే మల్టీకలర్ లెహంగా ధరించిన ఈమె రాధా గెటప్ లో అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. హెవీ జువెలరీతో పువ్వుల మధ్యలో విరబూసిన జాజిల తన సోయగాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. పూల మధ్యలో పుత్తడి బొమ్మ.. అందాల సోయగాన్ని చూడతరమా అనే రేంజ్ లో అభిమానులు కవిత్వాలు వల్లిస్తున్నారు. మొత్తానికైతే అసలైన రాధా గెటప్ లో శ్రీలీల అబ్బురపరుస్తోంది అంటూ నెటిజన్స్ చేస్తున్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ వైబ్ ఏమాత్రం తగ్గట్లేదు అనేలా శ్రీ లీల మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
మొత్తానికి అయితే రాధా గెటప్ లో శ్రీ లీల షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నటి అయిన శ్రీ లీల తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తొలిసారి చిత్రాంగదా అనే చిత్రంలో బాల కళాకారిణిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. కిస్ అనే కన్నడ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.. ఈ చిత్రాన్ని తెలుగులో ఐ లవ్ యు ఇడియట్ అనే పేరుతో విడుదల చేశారు. 2021లో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ధమాకా సినిమాతో ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక తర్వాత స్కంద, భగవంత్ కేసరి, ఆది కేశవ , ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ , గుంటూరు కారం, రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర ఇలా పలు చిత్రాలు చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో స్టార్ స్టేటస్ ఈమెకు లభించలేదు. ముఖ్యంగా పుష్ప 2 : ది రూల్ చిత్రంలో కిస్సిక్ పాటలో స్పెషల్ సాంగ్ చేసి అబ్బురపరిచింది. అటు తమిళంలో చేసిన పరాశక్తి సినిమా కూడా మంచి గుర్తింపు అందివ్వలేదు. ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తోంది. అలాగే ఉరి అనే మరో చిత్రంలో కూడా భాగమయ్యింది. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీ లీలాకు ఈ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.
