రాశి తెలివైన ప్లాన్.. మరి శ్రీలీల సంగతేంటి?
టాలీవుడ్ లో గ్లామర్ స్టార్ హీరోయిన్ల పరిస్థితిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
By: M Prashanth | 23 March 2026 1:58 PM ISTటాలీవుడ్ లో గ్లామర్ స్టార్ హీరోయిన్ల పరిస్థితిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కొంతమంది హీరోయిన్లు ఇప్పుడు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించలేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా యంగ్ బ్యూటీలు శ్రీలీల, రాశి ఖన్నా వంటి హీరోయిన్ల కెరీర్ పై ఆ చర్చ మరింత ఎక్కువగా జరుగుతోంది.
ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన శ్రీలీల ఇటీవల భారీ ప్రాజెక్టుల్లో నటించినప్పటికీ, అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. పవన్ కళ్యాణ్ తో కలిసి ఇటీ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, ఆశించిన రేంజ్ లో రాణించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో శ్రీలీల కెరీర్ ప్లాన్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త డౌట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు రాశి ఖన్నా పరిస్థితి కూడా అంత భిన్నంగా లేదు. ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే, రాశి మాత్రం పరిస్థితిని అర్థం చేసుకుని ముందుగానే తెలివైన ప్లాన్ ను రెడీ చేసుకున్నట్లు కనిపిస్తోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న వేళ, ఆమె ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వైపు అడుగులు వేసింది. వెబ్ సిరీస్ లు, డిజిటల్ కంటెంట్ ద్వారా కొత్త ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.
ఆ ప్లాన్ రాశి ఖన్నాకు కొంతవరకు ప్లస్ అయిందని చెప్పాలి. ఓటీటీ ప్రాజెక్టులు ఆమెకు కొత్త ఇమేజ్ ను తీసుకువచ్చాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా తన టాలెంట్ చూపించడానికి ఆ ప్లాన్ సహాయపడుతుంది. కానీ శ్రీలీల మాత్రం ఇంకా అలాంటి ఆప్షనల్ ప్లాన్ వేసుకున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె థియేట్రికల్ సినిమాలపైనే ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది.
ఇది ఒకవైపు రిస్క్ గా మారే అవకాశం ఉందని సినీ ప్రియులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వరుసగా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోతే, హీరోయిన్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మార్పులకు తగినట్టు అడుగులు వేయాల్సిందే. గతంలో అనేకమంది హీరోయిన్లు కూడా ఇలాంటి పొజిషన్ ను ఎదుర్కొని, వెబ్ సిరీస్ లు లేదా ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ తిరిగి బిజీ అయ్యారు. రాశి కూడా అదే ప్లాన్ తో ముందుకు వెళ్లడం ఆమెకు హెల్ప్ అవుతుంది
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. శ్రీలీల కూడా అలాగే చేస్తుందా? లేక థియేట్రికల్ సినిమాల ద్వారానే తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె టాలెంట్, డ్యాన్స్ స్కిల్స్ దృష్ట్యా మంచి అవకాశాలు ఇంకా రావచ్చు. అయితే వాటిని ఎలా యూజ్ చేసుకుంటుందన్నదే ఆమె ఫ్యూచర్ ను నిర్ణయించనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి శ్రీలీల డిసిషన్స్ పై నిలిచింది.
