ముంబైకి శాశ్వతంగా షిఫ్టవుతున్న శ్రీలీల?
దక్షిణాది చిత్రసీమలో తన అద్భుతమైన డాన్సులు, గ్లామర్‌తో కుర్రకారును ఒక ఊపు ఊపేసిన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల తాజా నిర్ణయంతో వార్తల్లో నిలిచారు.
By: Sivaji Kontham | 9 Sept 2026 7:00 AM ISTదక్షిణాది చిత్రసీమలో తన అద్భుతమైన డాన్సులు, గ్లామర్‌తో కుర్రకారును ఒక ఊపు ఊపేసిన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల తాజా నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లోని ఒక గెస్ట్ అకామడేషన్‌లో ఉంటూ వరుస టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు హైదరాబాద్‌ను శాశ్వతంగా వదిలి ముంబైకి పర్మినెంట్‌గా షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో వరుస అవకాశాలు తలుపు తడుతుండటంతో అక్కడ ఒక సొంత ఇల్లు లేదా సరైన అపార్ట్‌మెంట్‌ను వెతుక్కునే పనిలో శ్రీలీల బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దక్షిణాది -ఉత్తరాది చిత్రసీమల్లో రాణిస్తున్న చాలామంది భామలు వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. నయనతార, త్రిష, అనుష్క శెట్టి వంటి స్టార్ హీరోయిన్లు హైదరాబాద్, చెన్నై, ముంబైలలో సొంత ఇళ్లు - స్థిరాస్తులను కొనుగోలు చేసి ప్రాపర్టీ విలువను బాగా పెంచుకున్నారు. ముఖ్యంగా అనుష్క, త్రిష, నయనతారలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ వంటి ప్రాంతాల్లో సొంత ఇళ్లు లేదా లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. షూటింగ్‌ల కోసం హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాల మధ్య నిరంతరం ప్రయాణిస్తూ.. మూడు భాషల్లోనూ నటిస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు.
శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు. యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్‌తో పాటు పలువురు అగ్ర హీరోల సినిమాల్లో కథానాయికగా అవకాశాలు దక్కించుకుంటూ, ``ప్రతిభకు సరిహద్దులు ఉండవని నిరూపిస్తున్న తెలుగు మూలాలున్న అమ్మాయిగా పేరు తెచ్చుకున్నారు. ఆఫర్లు పెరగడం వల్ల ముంబైలో నివాసం ఏర్పరచుకోవడం మంచి నిర్ణయమే అయినా టాలీవుడ్‌ను పూర్తిగా పక్కనపెట్టి హైదరాబాద్‌ను వదిలి వెళ్లడం సరైనదేనా అనే చర్చ నెటిజన్లలో నడుస్తోంది. టాలీవుడ్ ఇచ్చే ఆదరణను కాపాడుకుంటూనే బాలీవుడ్‌ను బ్యాలెన్స్ చేయడమే ఉత్తమమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా శ్రీలీల తన వ్యక్తిత్వంతో కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈ డాక్టర్ కమ్ యాక్ట్రెస్ సినిమాల ద్వారా బాగా ఆర్జించి.. ఆ డబ్బుతో హైదరాబాద్‌లోని నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే గొప్ప ఆశయాన్ని అభిమానులు కోరుకుంటున్నారు. హైదరాబాద్‌తో ఆ స్థాయి బంధం ఉన్న శ్రీలీల.. నగరంతో ఉన్న అనుబంధాన్ని పూర్తిగా తెంచుకోవడం సాధ్యమేనా అన్నది ఆసక్తికరంగా మారింది.
సినిమా అవకాశాల కోసం ముంబైకి మకాం మార్చడం ప్రాక్టికల్ నిర్ణయమే అయినా.. తనను స్టార్‌గా నిలబెట్టిన హైదరాబాద్‌ను శ్రీలీల శాశ్వతంగా వదిలేస్తారా లేదా మిగిలిన హీరోయిన్లలాగా ఇక్కడ కూడా ఒక పర్మినెంట్ హోమ్ సెటప్ చేసుకుంటారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా తన నటనతో గ్లామర్ వరల్డ్ ని ఏలడంతో పాటు.. పేదలకు వైద్యం అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
