Begin typing your search above and press return to search.

పీరియడ్స్ టాపిక్‌తో వివాదంలో చిక్కుకున్న హీరోయిన్

ఇది కేవలం ఒక కామెంట్‌పై వచ్చిన రియాక్షన్ మాత్రమే కాదు; పర్సనల్ ఓపీనియన్ వర్సెస్ జనరల్ రియాలిటీ మధ్య ఉన్న అంతరాన్ని బయటపెట్టింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 April 2026 7:26 PM IST
పీరియడ్స్ టాపిక్‌తో వివాదంలో చిక్కుకున్న హీరోయిన్
X

ప్రముఖ నటి శ్రీలీల ఇటీవల చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా పెద్ద వివాదానికి దారితీశాయి. ఒక పబ్లిక్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆమె, షూటింగ్ సమయంలో పీరియడ్స్ ఉన్నప్పటికీ పని చేశానని, మెన్స్ట్రుయేషన్‌ను ఒక పరిమితిగా చూడకూడదని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా సమాన అవకాశాల కోసం మహిళలు ప్రయత్నిస్తున్నప్పుడు, పీరియడ్స్ కారణంగా వెనక్కి తగ్గడం సరైందా? అనే ఆమె ప్రశ్న చర్చకు దారితీసింది.

ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన విభిన్నంగా కనిపించింది. ఒకవైపు ఆమె ప్రొఫెషనలిజం, రిజిలియన్స్‌ను ప్రశంసించినవారు ఉండగా, మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. చాలామంది యూజర్లు ఒకరికి సాధ్యమైతే అందరికీ సాధ్యం అవుతుందనేలా చెప్పడం సరైంది కాద‌ని అభిప్రాయపడ‌గా, మరికొందరు పీరియడ్ పెయిన్‌ను ఎక్స్క్యూస్ గా చూడటం బాధాకరమని, ఇది నిజమైన ఆరోగ్య సమస్య అని పేర్కొన్నారు.

ఇది కేవలం ఒక కామెంట్‌పై వచ్చిన రియాక్షన్ మాత్రమే కాదు; పర్సనల్ ఓపీనియన్ వర్సెస్ జనరల్ రియాలిటీ మధ్య ఉన్న అంతరాన్ని బయటపెట్టింది. శ్రీలీల చెప్పింది ఆమె వ్యక్తిగత అనుభవం కావచ్చు, కానీ అదే ప్రతి మహిళకు వర్తించదని నిపుణులు మరియు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. పీరియడ్స్ అనుభవం ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటుంది. కొంతమందికి తేలికగా ఉంటే, మరికొందరికి తీవ్రమైన నొప్పి, అలసట, లేదా హార్మోనల్ సమస్యలు ఎదురవుతాయి.

ఈ వివాదం మహిళల ఆరోగ్యంపై ఉన్న అవగాహనను కూడా మరోసారి చర్చకు తీసుకొచ్చింది. PCOS, తీవ్రమైన క్రాంప్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు చాలా మంది మహిళల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్క్‌ప్లేస్ సపోర్ట్, ఫ్లెక్సిబిలిటీ, మరియు పీరియడ్స్ లీవ్ వంటి అంశాలు మరింత ప్రాముఖ్యత పొందుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇది సెలబ్రిటీ రెస్పాన్సిబిలిటీపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. కోట్లాది ఫాలోవర్స్ ఉన్న ప్రముఖులు మాట్లాడే ప్రతి మాటకు ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా సెన్సిటివ్ టాపిక్స్‌పై మరింత జాగ్రత్త అవసరమని కొందరు భావిస్తున్నారు. అంతేకాక, శ్రీలీల‌కు మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో, ఆమె వ్యాఖ్యలు మరింత సమతుల్యంగా ఉండాలని చాలామంది ఆశించారు. అయితే, ఈ మొత్తం వివాదంలో మిస్ క‌మ్యూనికేష‌న్ అంశం కూడా కీలకంగా మారింది. కొందరు ఆమె మాటలను కాంటెక్ట్స్ నుంచి వేరుచేసి అర్థం చేసుకున్నారని, అసలు ఉద్దేశం మహిళల్లో మెంటల్ స్ట్రెంగ్త్‌ను ప్రోత్సహించడం కావచ్చని వాదిస్తున్నారు. ఆమె చెప్పింది బాధలను తక్కువగా చూడటం కాదని, వాటిని అధిగమించే ధైర్యాన్ని ప్రోత్సహించడమేనని సపోర్టర్లు చెబుతున్నారు. ఏదేమైనా శ్రీలీల చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి.