శ్రీలీల ఇంకేం చేయాలి..?
శివ కార్తికేయన్ పరాశక్తి సినిమాతో టమిళ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమాతో ఆమె అక్కడ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు.
By: Ramesh Boddu | 12 Jan 2026 10:17 AM ISTశివ కార్తికేయన్ పరాశక్తి సినిమాతో టమిళ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమాతో ఆమె అక్కడ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు. సుధ కొంగర డైరెక్షన్ లో తెరకెక్కిన పరాశక్తి ఒక సీరియస్ కథతో వచ్చింది. ఐతే సినిమాపై ఎన్ని అంచనాలైతే ఉన్నాయో వాటిని అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. పరాశక్తి సినిమా రిజల్ట్ శ్రీలీలని కూడా డిజప్పాయింట్ చేస్తుంది. ఆమె ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది.
రిజల్ట్ ఎఫెక్ట్ శ్రీలీల మీద..
శ్రీలీల సినిమాలో ఉంది అంటే డాన్స్ లు అదిరిపోతాయి. ఇదే ఆడియన్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఐతే ఆమె నటనా ప్రతిభ మాత్రం గుర్తించట్లేదు. అఫ్కోర్స్ భగవంత్ కేసరి తప్ప శ్రీలీల అంత బలమైన రోల్స్ చేసింది లేదు. ఐతే పరాశక్తి సినిమా విషయంలో శ్రీలీల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సూరరై పోట్రు లాంటి సినిమా తీసిన సుధా కొంగర డైరెక్షన్ లో సినిమా కాబట్టి కచ్చితంగా సినిమా వర్క్ అవుట్ అవుతుందని అనుకోగా అది కాస్త రివర్స్ అయ్యింది.
ముఖ్యంగా ఈ రిజల్ట్ ఎఫెక్ట్ శ్రీలీల మీద బాగా పడుతుంది. ఆల్రెడీ తెలుగులో వరుస ఫ్లాపులతో శ్రీలీల కెరీర్ లో వెనకపడింది. ఆమె ఏం చేసినా సరే వర్క్ అవుట్ అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ రవితేజతో చేసిన మాస్ జాతర సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. శ్రీలీల కూడా ఇక నుంచి తన పంథా మార్చాలని చూస్తుంది.
శ్రీలీలకు బాలీవుడ్ కెరీర్..
ఆమెతో లవ్ స్టోరీస్ తీస్తే బాగానే వర్క్ అవుట్ అవుతాయి కానీ ఆమెను కమర్షియల్ సినిమాలకే పరిమితం చేస్తున్నారు. ఐతే తెలుగు, తమిళ్ లో శ్రీలీల కెరీర్ ఇలా ఉండగా బాలీవుడ్ లో శ్రీలీల చేస్తున్న సినిమాపై మాత్రం హ్యూజ్ బజ్ ఉంది. అనురాగ్ బసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో బాలీవుడ్ ఆడియన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జోడీ అదిరిపోతుందని అంటున్నారు.
ఇప్పటికే ఆ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ బజ్ ఏర్పరచుకుంది. శ్రీలీలకు బాలీవుడ్ లో కెరీర్ బాగుండాలంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. ఐతే సౌత్ లో కెరీర్ ఎలాగు అంత సాటిస్ఫైడ్ గా లేదు కాబట్టి శ్రీలీల హిందీలోనే పట్టు సాధించాలని చూస్తుంది. మరి అమ్మడికి ఈ సినిమా ఎంతవరకు బూస్టింగ్ ఇస్తుంది అన్నది చూడాలి.
ఓ పక్క సౌత్ హీరోయిన్స్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. శ్రీలీల కెరీర్ లో ఒక స్ట్రాంగ్ బూస్టప్ ఇచ్చే సినిమా పడాలి. పరాశక్తి తర్వాత ఆమె తెలుగు, తమిళ్ లో ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఆమె హిందీ సినిమా మీదే తన ఫోకస్ అంతా పెడుతుంది.
