Begin typing your search above and press return to search.

మ‌రో స్టార్ హీరోకి జోడీగా కిసిక్ బ్యూటీ!

టాలీవుడ్ డాల్ శ్రీలీల అన్నీ భాష‌ల్ని దున్నేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏ భాష‌లో అవ‌కాశం వ‌చ్చినా కాద‌న‌కుండా క‌మిట్ అవుతుంది.

By:  Srikanth Kontham   |   11 Aug 2025 12:48 PM IST
మ‌రో స్టార్ హీరోకి జోడీగా కిసిక్ బ్యూటీ!
X

టాలీవుడ్ డాల్ శ్రీలీల అన్నీ భాష‌ల్ని దున్నేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏ భాష‌లో అవ‌కాశం వ‌చ్చినా కాద‌న‌కుండా క‌మిట్ అవుతుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ అంటూ మూడు భాష‌ల్లోనూ బిజీగా ఉంది. అని వార్య కార‌ణాలో ఓ రెండు తెలుగు సినిమాలు వదులు కున్నా? టాలీవుడ్ కి మాత్రం తానెంత‌ దూరం కాద‌న్న‌ది అంతే వాస్త‌వం. ప్ర‌స్తుతం మూడు భాష‌ల్లో క‌లిపి నాలుగు సినిమాలు చేస్తోంది. ప్ర‌త్యేకించి బాలీవుడ్ డెబ్యూ `ఆషీకీ 3`పై స్పెష‌ల్ ఫోక‌స్ తో ప‌నిచేస్తోంది. అక్క‌డ మరిన్ని కొత్త అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది.

అదే ఆస‌క్తిని కోలీవుడ్ పై కూడా చూపిస్తోంది. ఇప్ప‌టికే శివ కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తోన్న `పరాశ‌క్తి`లో న‌టి స్తోంది. కోలీవుడ్ లో కిసిక్ బ్యూటీ డెబ్యూ చిత్ర‌మిదే. శివ కార్తికేయ‌న్ వ‌రుస విజ‌యాల త‌ర‌హాలోనే తాను కోలీవుడ్ కెరీర్ దేదీప్య‌మానంగా ముందుకు తీసుకెళ్లాల‌ని ఆశ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం ప‌రాశ‌క్తి ఆన్ సెట్స్ లో ఉంది. సుధ‌కొంగ‌ర తెర‌కెక్కిస్తోన్న చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. కోలీవుడ్ లో ఐదేళ్ల త‌ర్వాత సుధ కొంగ‌ర తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. ఇంత‌టి లాంగ్ గ్యాప్ నేప‌థ్యంలో కంటెంట్ ఉన్న క‌థ‌తో వ‌స్తోంది? అన్న ధీమా ప్రేక్ష‌కాభిమానుల్లో ఉంది.

సినిమాపై ఉన్న పాజిటివిటీ శ్రీలీల‌కు క‌లిసొస్తుంది. డెబ్యూ చిత్ర‌మే ట్యాలెంటెడ్ మేక‌ర్ చేతిలో ప‌డింద‌న్న ప్ర‌శంస క‌లిసొస్తుంది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే? తాజాగా కోలీవుడ్ లో శ్రీలీల‌ మ‌రో సినిమాకు సైన్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. త‌ల అజిత్ హీరోగా అదిక్ ర‌విచంద్ర‌న్ ఓ సినిమాకు స‌న్నాహాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. `గుడ్ బ్యాడ్ అగ్లీ` త‌ర్వాత అజిత్ ప‌ట్టు బట్టి మ‌రి ర‌విచంద్ర‌న్ ని రెండ‌వ సారి రంగంలోకి దించారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇందులో ఓ హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసారు.

తాజాగా మ‌రో హీరోయిన్ గా శ్రీలీల పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. సెకెండ్ లీడ్ లో శ్రీలీల పేరు వినిపిస్తోంది. మ‌రోవైపు కీల‌క పాత్ర కోసమ‌నే ప్ర‌చారం కూడా తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి అజిత్ కి జోడీగా హీరోయిన్ అవుతుందా? కీల‌క పాత్ర‌కే ప‌రిమిత‌మ‌వుతుందా? అన్నది మ‌రికొన్ని రోజుల్లో క్లారిటీ వ‌స్తుంది. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ముగింపులో ప్రారంభించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.