Begin typing your search above and press return to search.

బన్నీతో ఐటెం సాంగ్‌.. శ్రీలీల ఎందుకలా?

తక్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల స్టార్ హీరోల సరసన నటిస్తూ, టాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్‌ గా మారిందని చెప్పాలి.

By:  M Prashanth   |   8 Jan 2026 6:00 PM IST
బన్నీతో ఐటెం సాంగ్‌.. శ్రీలీల ఎందుకలా?
X

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప-2లో యంగ్ హీరోయిన్ శ్రీలీల.. ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి.. టాలీవుడ్‌ లో డ్యాన్స్ అంటే గుర్తొచ్చే పేర్లలో శ్రీలీల ఒకటి. తన ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్‌ తో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఆమె సొంతమైంది. తక్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల స్టార్ హీరోల సరసన నటిస్తూ, టాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్‌ గా మారిందని చెప్పాలి.

ఎన్నో సినిమాల్లో తన ఎనర్జీతో పాటలను చార్ట్‌ బస్టర్ హిట్లుగా మార్చిన ఆ బ్యూటీ, పుష్ప 2లో అల్లు అర్జున్‌ తో కలిసి కిసిక్ సాంగ్‌ తో దుమ్మురేపిన సంగతి విదితమే. తన మాస్ డ్యాన్స్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె, ఇప్పటికే ఆ సాంగ్ కోసం పలుమార్లు మాట్లాడారు. ఇప్పుడు మరోసారి తన అప్ కమింగ్ మూవీ పరాశక్తి ప్రమోషన్స్ లో పలు కామెంట్స్ చేశారు.

పుష్ప 2లో ఐటెం సాంగ్‌ చేయడం అంత ఈజీగా తీసుకున్న నిర్ణయం కాదని చెప్పిన ఆమె.. సాంగ్ వల్ల తనకు విపరీతమైన గుర్తింపు, రీచ్‌ వచ్చిందని తెలిపారు. "పుష్ప 2 ఐటెం సాంగ్‌ చేయాలా వద్దా అనే విషయంలో చాలా ఆలోచించాను. చివరకు చేశాను. ఆ పాట వల్ల ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. కానీ మళ్లీ ఇలాంటి ఐటెం నంబర్‌ చేయాలా అంటే.. నాకు తెలియదు" అని చెప్పారు.

దీంతో ఇప్పుడు ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యంగా ఐటెం సాంగ్‌ ను తక్కువగా చూసినట్టుగా ఉందని కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాంటి భారీ సినిమాలో ఐటెం సాంగ్‌ చేసే అవకాశం ప్రతి హీరోయిన్‌ కు రాదని, ఆ పాట కోసం శ్రీలీలకు దాదాపు రూ.2 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయని అంటున్నారు.

అంత మొత్తం తీసుకుని, ఇప్పుడు ఆ పాటను చేసినందుకు ఇష్టం లేనట్టు మాట్లాడటం సరికాదని విమర్శలు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం శ్రీలీలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక హీరోయిన్ గా తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఆమెకు ఉందని చెబుతున్నారు. ప్రతి పాత్ర, ప్రతి పాట ఒకేలా ఉండదని, ఐటెం సాంగ్‌ చేయడం వ్యక్తిగత నిర్ణయమవుతుందని అన్నారు.

మొత్తానికి తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిన సాంగ్ పై శ్రీలీల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారి, యూట్యూబ్‌, రీల్స్‌ తో కోట్ల వ్యూస్‌ సాధించిన సాంగ్ పై బ్యూటీ కామెంట్స్ కు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో ఆమె మళ్లీ స్పందిస్తారా? లేక సైలెంట్ గా ఉంటారా? అనేది వేచి చూడాలి.