Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   2 Nov 2026 12:22 PM IST
మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?
X

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచే ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తోంది. మొదట దర్శకుడి విషయంలో.. ఆ తర్వాత కథలో మార్పులు.. ఇలా సినిమా ముందుకు వెళ్లడానికి చాలా సమయం పడుతోంది. ఇప్పుడు హీరోయిన్ మరో సమస్యగా మారింది.

మోక్షజ్ఞ డెబ్యూ సినిమా మొదట్లోనే వేగంగా పట్టాలెక్కుతుందని అందరూ భావించారు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వరుస మార్పులు..చోటుచేసుకోవడంతో సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. దర్శకుడి మార్పుతో పాటు కథ విషయంలో కూడా పలు మార్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు హీరోయిన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

కొద్దిరోజుల క్రితం వరకు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటుడు శ్రీకాంత్, ఊహల కుమార్తె మేధా మేకను పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సినిమా ఆలస్యం కావడం.. మరికొన్ని కారణాలవల్ల.. ఆ నిర్ణయం మారినట్లు తెలుస్తోంది.

మేధా మేక ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఓ రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మైత్రీ ఇన్ లవ్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొత్త నటుడు జై జాస్తి హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

మరోవైపు మోక్షజ్ఞ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శ్రీలీల పేరు కూడా వినిపిస్తోంది. మొత్తం పైన ఎంతో మంది హీరోయిన్లు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో.. బాలకృష్ణ కొడుకు సినిమాకి హీరోయిన్ సెలక్షన్ ప్రాబ్లం అవ్వడం ఆశ్చర్యం అనే చెప్పాలి. మరి చివరికి ఈ సినిమాలో హీరోయిన్ అయ్యే భాగ్యం ఎవరి సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.