గొర్రె పిల్లతో శ్రీలీల ముచ్చట్లు.. ఫేమస్ సీన్ రీక్రియేషన్ చూశారా?
తన అప్ కమింగ్ మూవీ మాస్ జాతర సెట్స్ లో ఓ గొర్రె పిల్లతో ముచ్చట్లు పెట్టిన శ్రీలీల.. ఐకానిక్ సినిమా సీన్ ను రీక్రియేట్ చేసింది.
By: M Prashanth | 4 Sept 2025 3:38 PM ISTయంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి సందD మూవీతో టాలీవుడ్ కు వచ్చిన ఆ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న బ్యూటీ.. డ్యాన్స్ తో అదరగొట్టేస్తుంది. ప్రతి స్టెప్ ను ఫుల్ గ్రేస్ తో వేసి ఓ ఊపు ఊపేస్తోందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. తెలుగు ఆడియన్స్ లో బిగ్ ఫ్యాన్ బేస్ ఆమె సొంతం.
ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ ను పోస్ట్ చేసే అమ్మడు.. అందరినీ ఫిదా చేస్తుందని చెప్పాలి. తనదైన గ్లామర్ తో ఆకట్టుకునే బ్యూటీ.. తన సోషల్ మీడియా వాల్ వైపు అందరినీ తిప్పుకుంటుంది. తాజాగా క్యూట్ వీడియో షేర్ చేయగా.. అది నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది.
తన అప్ కమింగ్ మూవీ మాస్ జాతర సెట్స్ లో ఓ గొర్రె పిల్లతో ముచ్చట్లు పెట్టిన శ్రీలీల.. ఐకానిక్ సినిమా సీన్ ను రీక్రియేట్ చేసింది. మేకతో ఫన్నీ ఇంటరాక్షన్ చేస్తూ.. ఏప్రిల్ తర్వాత ఏమి వస్తుంది? అని అడిగింది. వెంటనే మేక మే.. అంటూ ఇచ్చిన సమాధానం నవ్వు తెప్పించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
కాగా, ఆ సీన్ సూపర్ హిట్ మూవీ ఆ ఒక్కటి అడక్కులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన ఐకానిక్ సన్నివేశాన్ని గుర్తుతెస్తోంది. అదే సమయంలో మాస్ జాతర సినిమా నుంచి త్వరలో అప్డేట్ ఇస్తానని కూడా శ్రీలీల తెలిపింది. సూపర్ హిట్ మూవీ ధమాకా తర్వాత మరోసారి ఆ మూవీకి గాను రవితేజ స్క్రీన్ ను షేర్ చేసుకుంటోంది శ్రీలీల.
అయితే మాస్ మహారాజా, శ్రీలీల కాంబోలో వస్తున్న ఆ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను ఇప్పుడు మేకర్స్ శరవేగంగా జరుపుతున్నారు.
ఆగస్టులో వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కావాల్సిన ఆ సినిమాను వర్క్స్ పెండింగ్ లో ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేశారు. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా సిద్ధమవుతున్న మాస్ జాతర మూవీని అక్టోబర్ 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న చిత్రం.. ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.
