Begin typing your search above and press return to search.

శ్రీ‌లీల క్యూలో అంత‌ర్జాతీయ బ్రాండ్లు

అంచెలంచెలుగా ఎద‌గ‌డం, త‌న ప్ర‌తిభ‌తో ప్ర‌తిసారీ అంద‌రి మ‌న్న‌న‌లు పొంద‌డం, ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డం ఇలాంటివి చాలా అరుదు.

By:  Sivaji Kontham   |   9 Oct 2025 3:00 AM IST
శ్రీ‌లీల క్యూలో అంత‌ర్జాతీయ బ్రాండ్లు
X

అంచెలంచెలుగా ఎద‌గ‌డం, త‌న ప్ర‌తిభ‌తో ప్ర‌తిసారీ అంద‌రి మ‌న్న‌న‌లు పొంద‌డం, ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డం ఇలాంటివి చాలా అరుదు. కానీ శ్రీ‌లీల విష‌యంలో ఇవ‌న్నీ సాధ్యం. అందుకే పోటీలో ఎంద‌రు ఉన్నా త‌న రేంజ్ ఎంత‌మాత్రం త‌గ్గ‌ద‌ని నిరూపిస్తోంది. ఈ బ్యూటీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ ఎదురే లేకుండా దూసుకెళుతోంది. క్రేజీగా టాప్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటోంది.

బాలీవుడ్ లో ఆరంగేట్ర‌మే అగ్ర క‌థానాయ‌కుడు కార్తీక్ ఆర్యన్ స‌ర‌స‌న శ్రీ‌లీల అవ‌కాశం అందుకుంది. అనురాగ్ బసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాకు `తు మేరీ జిందగీ హై` అనే అధికారిక టైటిల్‌ను ఫిక్స్ చేసారు. ఆషిఖి త‌ర‌హాలో అద్బుత‌మైన మ్యూజిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ప్రేమ‌క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండ‌డంతో యువ‌త‌రంలో ఆస‌క్తి నెల‌కొంది. మే 2026లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. 2025 చివరి నాటికి టాకీ పూర్త‌వుతుంది. పోస్ట్-ప్రొడక్షన్ పాటల చిత్రీకరణ 2026 ప్రారంభంలో జ‌రుగుతుంది. మే 2026 లో సినిమాని విడుదల చేయాల‌నేది ప్లాన్.

మ‌రోవైపు శ్రీ‌లీల టాలీవుడ్ లోను ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌కు క‌మిట్ కానుంద‌ని స‌మాచారం. మాస్ జాత‌ర ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప‌రాశ‌క్తి, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ లాంటి భారీ చిత్రాల‌కు శ్రీ‌లీల ఇప్ప‌టికే క‌మిటైంది.

జ‌ర్మ‌న్ బ్రాండ్ కి ప్ర‌చారం:

క్ష‌ణం తీరిక లేనంత బిజీ షెడ్యూళ్ల‌తో ఉన్న ఈ బ్యూటీని మ‌రోవైపు బ్రాండ్స్ కూడా వెంబ‌డిస్తున్నాయి. సినిమాల చిత్రీక‌ర‌ణ‌ల‌తో పాటు, అటు కార్పొరెట్ బ్రాండ్ల ప్ర‌చార కాంట్రాక్టుల‌ను కుదుర్చుకోవ‌డంలోను శ్రీ‌లీల స్పీడ్ ప్ర‌ద‌ర్శిస్తోంది. తాజాగా లుప్తాన్సా ప్ర‌క‌టనకు సంబంధించిన వీడియో విడుద‌లైంది. లండ‌న్ కేంద్రంగా ప‌ని చేస్తున్న‌ ప్ర‌ఖ్యాత‌ జ‌ర్మ‌న్ ఏవియేష‌న్ గ్రూప్ కి చెందిన లుప్తాన్సాకు శ్రీ‌లీల ప్ర‌చారం చేస్తోంది. యూత్ హృద‌యాల‌ను కొల్ల‌గొట్టే ఫోజుల‌తో శ్రీ‌లీల ఫోటోషూట్ లుప్తాన్సాకు అదిరిపోయే మైలేజ్ పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు.