Begin typing your search above and press return to search.

వీడియో : ఫేమస్‌ గణేషుడి వద్దకి శ్రీలీల

తాజాగా మరోసారి శ్రీలీల సోషల్ మీడియాలో ఈ వీడియోతో వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ కి చెందిన ఎంతో మంది స్టార్స్‌ దర్శించుకునే గణేషుని వద్దకు శ్రీలీల తన తల్లితో కలిసి వెళ్ళింది.

By:  Ramesh Palla   |   4 Sept 2025 3:15 PM IST
వీడియో : ఫేమస్‌ గణేషుడి వద్దకి శ్రీలీల
X

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో ఆఫర్లు రావడమే కష్టం అనుకుంటున్న సమయంలో శ్రీలీల ఏకంగా టాప్ స్టార్‌ హీరోలకు జోడీగా నటించడం ద్వారా తన ప్రత్యేకతను నిరూపించుకుంది. తెలుగు మూలాలు ఉన్న శ్రీలీల టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు. రాఘవేంద్ర రావు నిర్మాణంలో వచ్చిన 'పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు మొదటి సినిమాతో ఆశించిన స్థాయిలో హిట్‌ అందుకోలేక పోయింది. కానీ తెలుగులో ఈమె చేసిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో ఒక్కసారిగా టాప్‌ స్టార్‌ అయింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి డాన్స్ ప్రతిభ ఉన్న హీరోయిన్‌ కావడంతో శ్రీలీలను టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మార్చేశారు.

పుష్ప 2 కిస్సిక్‌ సాంగ్‌తో బాలీవుడ్‌లో గుర్తింపు

అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్‌ను చేయడం ద్వారా ఒక్కసారిగా బాలీవుడ్‌లోనూ ఫేమస్‌ అయింది. డాన్స్‌ విషయంలో చాలా మంది హీరోయిన్స్ కంటే శ్రీలీల ఉత్తమమైన హీరోయిన్‌ అని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. శ్రీలీల డాన్స్ తో కిస్సిక్ పాట స్థాయిని అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఆ పాటతో వచ్చిన క్రేజ్‌తోనే శ్రీలీల బాలీవుడ్‌లో ఆషికి 3 సినిమాను చేయడంతో పాటు కోలీవుడ్‌లోనూ ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇక టాలీవుడ్‌లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు నాలుగు సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి. వరుస సినిమాలతో ఈ అమ్మడు ఎప్పుడూ బిజీగానే ఉంది. ఇక సోషల్‌ మీడియాలో అదే స్థాయిలో జోరును కంటిన్యూ చేస్తుంది. ఎప్పుడూ ఇన్‌స్టాలో వైరల్‌ కావడం మనం చూస్తూ ఉంటాం.

ముంబైలో లాల్‌బాగ్చా రాజా గణేషుడి వద్దకు శ్రీలీల

తాజాగా మరోసారి శ్రీలీల సోషల్ మీడియాలో ఈ వీడియోతో వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ కి చెందిన ఎంతో మంది స్టార్స్‌ దర్శించుకునే గణేషుని వద్దకు శ్రీలీల తన తల్లితో కలిసి వెళ్ళింది. ముంబైలో అత్యంత ప్రసిద్ధ గణపతి లాల్ బాగ్చా రాజా మండపంకి బాలీవుడ్‌ కి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ప్రతి ఏడాది వెళ్తూ ఉంటారు. ఈ సారి కూడా పలువురు సెలబ్రిటీలు దర్శించుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చింది. ఈమె హీరోయిన్‌గా హిందీలో ఒక సినిమా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీలీల ఆ గణేషుని వద్దకు వెళ్లిందట. గణేషుని వద్ద శ్రీలీల సింపుల్‌ అండ్‌ స్వీట్‌గా కనిపించింది. చాలా కూల్‌గా హెయిర్ స్టైల్‌ను సర్దుకుంటూ క్యూట్‌గా నవ్వుకుంటూ, ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ అక్కడ నుంచి ముందుకు వెళ్లి పోయింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

ఆషికి 3 తో బాలీవుడ్‌లో శ్రీలీల ఎంట్రీ

శ్రీలీల ప్రస్తుతం హిందీలో ఆషికి 3 సినిమాలో నటించడంతో పాటు తెలుగులో రవితేజకు జోడీగా మాస్‌ జాతర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన మాస్ జాతర సినిమా షూటింగ్‌ ఆలస్యం కావడం వల్ల విడుదల వాయిదా పడింది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళ్‌ లో ఈమె భారీ సినిమా పరాశక్తి లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తో కోలీవుడ్‌లో సాలిడ్‌ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది. సౌత్‌ లో కన్నడంలో ఇప్పటికే నటించిన శ్రీలీల తెలుగు, తమిళ్‌ లో సినిమాలు చేసింది, చేస్తుంది. మరో వైపు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇన్ని భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ అరుదైన ఘనత దక్కించుకుంది.