Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న యువ నటి శ్రీలీల.. రజనీకాంత్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

By:  Srikanth Kontham   |   5 Nov 2026 7:00 PM IST
కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!
X

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `ధర్మన్` చిత్రానికి సంబంధించి వరుస క్రేజీ అప్‌డేట్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. `ఓ మై కడవులే`, `డ్రాగన్` వంటి వైవిధ్యమైన చిత్రాల ద్వారా దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా యూనిట్ ప్రకటించిన అఫీషియల్ కాస్టింగ్ ప్రకటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న యువ నటి శ్రీలీల.. రజనీకాంత్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. `ధర్మన్` చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి ఆమె ఎంపికైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిత్ర నిర్మాణ సంస్థ కమలహాసన్ ఆధ్వర్యంలోని `రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్` సోషల్ మీడియా వేదికగా శ్రీలీలపై ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. `షి ఈజ్ గాట్ ది స్పార్క్.. షి ఈజ్ గాట్ ది పటాకా. వెల్కమింగ్ ది గార్జియస్ శ్రీలీల టూ ధర్మన్` అంటూ మేకర్స్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో శ్రీలీల పాత్ర ఏంటనే దానిపై మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌క‌పోయినా? ఆమె ఎంట్రీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ నయనతారతో పాటు సిమ్రాన్, రాశీ ఖన్నా వంటి ప్రముఖ తారలు కూడా నటిస్తున్నారు. ఒకే చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతారతో పాటు శ్రీలీల వంటి క్రేజీ కాంబినేషన్ సెట్ కావడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

`తలైవర్ 173` వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న చిత్రంలో రజనీకాంత్ పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రజనీకాంత్ చేతికి రక్తంతో విభిన్నమైన షేడ్స్‌తో కనిపించడం విశేషం. ఈ చిత్రంలో ఆయన డాక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు .. క్యారెక్టర్‌లో గ్రే షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ విజ‌యం కూడా శ్రీలీల‌కు కీల‌క‌మైందే. అమ్మ‌డు ఇప్ప‌టికే వ‌చ్చిన కొన్ని అవ‌కాశాలు కాద‌నుకుని బాలీవుడ్ కి వెళ్లి ప్ర‌తికూల జోన్ లోకి వెళ్లింది. ఇలాంటి స‌మ‌యంలో ఏకంగా ర‌జ‌నీ సినిమాలో ఛాన్స్ అంటే ఎంతో గొప్ప‌ది. సినిమా స‌క్సెస్ అయితే వ‌చ్చే గుర్తింపు ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంది.