శ్రీలీల కెరీర్ డిసైడ్ చేసే సినిమా..?
నటి కావాలని చిన్నప్పటి నుంచి కలలు కని డాక్టర్ ప్రొఫెషన్ చేసినా తాను యాక్టర్ అని ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది శ్రీలీల.
By: Ramesh Boddu | 28 Oct 2025 11:01 AM ISTనటి కావాలని చిన్నప్పటి నుంచి కలలు కని డాక్టర్ ప్రొఫెషన్ చేసినా తాను యాక్టర్ అని ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది శ్రీలీల. చినప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న శ్రీలీల ఆమె డాన్స్ లతో అదరగొట్టేస్తుంది. ఇక కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా తెలుగులో పెళ్లిసందడితో పరిచయమైంది. ఆమె చలాకీతనం చూసి మాస్ మహారాజ్ రవితేజ ధమాకా ఛాన్స్ ఇచ్చారు.
ధమాకాతో దుమ్ము దులిపేసింది శ్రీలీల. సినిమాలో క్యారెక్టర్స్ పరంగా ఇంకాత డెప్త్ ఉండాలని అనిపిస్తున్నా శ్రీలీల క్యూట్ లుక్స్.. ఇక ఆమె మార్క్ డాన్స్ అయితే కుర్రాళ్లకు తెగ ఇంప్రెస్ చేస్తుంది. ధమాకా తర్వాత వరుస అవకాశాలతో అదరగొట్టేసిన అమ్మడు ఆ ఛాన్స్ లతో పాటు ఫ్లాపులను ఖాతాలో వేసుకుంది. శ్రీలీల డాన్స్ లు తప్ప ఇంక ఏమి చేయదా అన్న కామెంట్స్ కూడా వచ్చాయి.
భగవంత్ కేసరి సినిమాతో యాక్షన్ సీన్స్..
వాటిని దాటి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని భగవంత్ కేసరి సినిమాతో యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టింది అమ్మడు. ఆ తర్వాత గుంటూరు కారం సినిమాతో కూడా తన లుక్స్ తో పాటు మహేష్ తో కూడా కుర్చీ మడతపెట్టి డాన్స్ తో ఆడియన్స్ ని మడత పెట్టేసింది.
శ్రీలీల అని పేరు వినపడగానే ఎనర్జిటిక్ డాన్స్ లు గుర్తొస్తాయి. కానీ ఆమె ఎంచుకుంటున్న కథలు మాత్రం ఎందుకో ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. డ్యాన్స్ లతో పాటు కొన్ని బలమైన పాత్రలు చేయడం వల్ల కూడా శ్రీలీల ఇంప్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ అమ్మడు ఎక్కువగా స్టార్ సినిమాల్లో నటించడం వల్ల ఆమెకు ఆ ఛాన్స్ ఉండట్లేదు.
యువ హీరోలతో శ్రీలీల..
యువ హీరోలతో శ్రీలీల నటిస్తే మాత్రం మంచి రోల్స్ దక్కే ఛాన్స్ ఉంటుంది. కానీ స్టార్స్ సినిమాలతో బిజీగా ఉంటున్న శ్రీలీల యంగ్ హీరోలతో నటించాలని ఉన్నా కూడా వీలు కుదరట్లేదు. అంతేకాదు ఆమె ఈమధ్య కొన్ని సినిమాల్లో ముహూర్తం చేసుకుని తీరా సెట్స్ మీదకు వెళ్లే సరికి ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ వస్తుంది. ఈ మార్పు ఎవరి వల్ల ఎందుకు అన్నది తెలియదు కానీ ఇలాంటివి కూడా శ్రీలీల కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తున్నాయి.
ఇక ఈమధ్య అమ్మడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల జత కడుతుంది. ఆషికి 3 అంటూ ప్రచారం జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే శ్రీలీల వరుస బాలీవుడ్ ఆఫర్లు అందుకుంటుంది.
తెలుగులో బ్యాడ్ లక్ వెంటాడుతుంది..
ఐతే తెలుగులో మాత్రం అమ్మడికి బ్యాడ్ లక్ వెంటాడుతుంది. ప్రస్తుతం శ్రీలీల మాస్ మహారాజ్ రవితేజతో మాస్ జాతర సినిమా చేసింది. మరో 3 రోజుల్లో రిలీజ్ అవబోతున్న ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది అమ్మడు. రవితేజతో ధమాకాతో హిట్ అందుకున్న శ్రీలీల మళ్లీ అదే రేంజ్ సక్సెస్ గురి పెట్టింది.
మాస్ జాతర ట్రైలర్ చూస్తే మాస్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చేలా సినిమాలానే ఉంది. అందులో శ్రీలీల విలేజ్ గాళ్ రోల్ లో ఇంప్రెస్ చేసేలా ఉంది. మాస్ జాతర హిట్ పడితే శ్రీలీల కెరీర్ మళ్లీ జోరు అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమా రిజల్ట్ ని బట్టే శ్రీలీల టాలీవుడ్ కెరీర్ డిపెండ్ అయ్యి ఉంది.
మాస్ జాతరతో పాటు శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అంటే శ్రీలీలకు లక్కీ అన్నట్టే లెక్క. మాస్ జాతర తో హిట్ పడితే ఆ క్రేజ్ ఉస్తాద్ కి కూడా కలిసి వచ్చి ఆ సినిమాతో కూడా అదరగొట్టేయాలని చూస్తుంది.
