పట్టుచీరలో మరింత సాంప్రదాయంగా కనిపించిన శ్రీ లీల!
కన్నడ బ్యూటీ అయిన శ్రీలీల తొలిసారి పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో సాంప్రదాయంగా కనిపించి.. తెలుగింటి అమ్మాయిలా.. కుర్రకారు గుండెలను దోచుకుంది.
By: Madhu Reddy | 21 July 2026 11:42 AM ISTకన్నడ బ్యూటీ అయిన శ్రీలీల తొలిసారి పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో సాంప్రదాయంగా కనిపించి.. తెలుగింటి అమ్మాయిలా.. కుర్రకారు గుండెలను దోచుకుంది. అలాంటి ఈమె.. ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటు సోషల్ మీడియాలో అభిమానులను అలరించడానికి నిత్యం ఆక్టివ్ గా ఉంటూ రోజుకు ఒక ఫోటోను షేర్ చేసే శ్రీలీలా తాజాగా మరోసారి సాంప్రదాయంగా దర్శనమిచ్చింది.
బనారసీ చీరలో ఆకట్టుకున్న శ్రీ లీల..
గ్రీన్ కలర్ ఆకుపచ్చ బనారసి చీరపై సిల్వర్ కలర్ బార్డర్ తో మధ్యలో అక్కడ చిన్న చిన్న బుటీలతో డిజైన్ చేసిన ఈ చీర చాలా అందంగా కనిపిస్తోంది.దీనికి కాంబినేషన్లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన ఈమె. తన మెడను ఫుల్ ఫీల్ చేసుకోవడానికి గ్రీన్ కలర్ స్టోన్ తో చాలా అద్భుతంగా డిజైన్ చేసిన చౌకర్ ను , దీనికి కాంబినేషన్లో చెవి దిద్దులను ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. అంతేకాదు తన చీరకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ ధరించి మొత్తానికి చాలా సాంప్రదాయంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది శ్రీ లీల. మధ్యన పాపిట తీసి జుట్టును వదిలేసిన ఈమె.. ఫోటోలలో అందాల యువరాణిగా కనిపిస్తోంది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
అందమైన అభినయం.. సక్సెస్ మాత్రం?
అలా లేటెస్ట్ ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది శ్రీ లీల. మరొకవైపు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ అయితే ఈ మధ్యకాలంలో లభించలేదు. నిజానికి ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శ్రీలీల ఆ తర్వాత చేసిన సినిమాలు విజయమవుతున్నా..ఈమెకు సరైన గుర్తింపు రావడం లేదు. ఇక చివరిగా మాస్ జాతర చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని పరితపించింది . కానీ కుదరలేదు.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో నైనా మంచి విజయం అందుకోవాలని చూసింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది.. అటు తమిళంలో పరాశక్తి సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా మంచి విజయం అయినప్పటికీ శ్రీలీలకు తగినంత గుర్తింపు లభించలేదు. ప్రస్తుతం హిందీలో వరుణ్ ధావన్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది.
బంగారం లాంటి సినిమాను మిస్ చేసుకున్న శ్రీ లీల..
ఇకపోతే ఇటీవల సూపర్ హిట్ అందుకున్న లెనిన్ సినిమాలో మొదట శ్రీలీలకు హీరోయిన్గా అవకాశం లభించింది . కొంత సన్నివేశాలు షూటింగ్ కూడా చేశారు. పైగా అఖిల్ శ్రీ లీల కాంబినేషన్ ఫోటోలని కూడా తెరపైకి తీసుకొచ్చారు. అయితే లెనిన్ సినిమా కథ విషయంలో నిర్మాతలు కాస్త ఆలస్యం చేయడంతో.. అప్పటికే పరాశక్తి మూవీకి డేట్స్ ఇవ్వడం వల్ల..ఈ సినిమాకు డేట్స్ క్లాష్ అయ్యాయి. ఇక పరస్పర అంగీకారంతో సినిమా నుంచి తప్పుకుంది. ఒకవేళ ఈ సినిమాలో శ్రీలీలా చేసి ఉండుంటే ఈమెకు మంచి విజయం లభించేదని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
