Begin typing your search above and press return to search.

శ్రీలీల గ్లామర్ షో.. కెరీర్ గ్రాఫ్ మళ్ళీ పుంజుకుంటుందా?

టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల పేరు వినబడితే చాలు, కుర్రాళ్ళలో ఒక రకమైన జోష్ కనిపిస్తుంది.

By:  M Prashanth   |   11 May 2026 7:00 PM IST
శ్రీలీల గ్లామర్ షో.. కెరీర్ గ్రాఫ్ మళ్ళీ పుంజుకుంటుందా?
X

టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల పేరు వినబడితే చాలు, కుర్రాళ్ళలో ఒక రకమైన జోష్ కనిపిస్తుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న ఈ బ్యూటీ, తన డ్యాన్స్ ఎనర్జీతో వెండితెరపై మ్యాజిక్ చేసింది. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా, తనదైన చలాకీతనంతో యూత్ కి బాగా దగ్గరైంది. లేటెస్ట్ గా విడుదలైన కొన్ని ఫోటోల్లో శ్రీలీల తన స్టైలిష్ లుక్ తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.




కలర్ఫుల్ కాంబినేషన్ లో ఆమె ఇస్తున్న పోజులు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. శ్రీలీల గ్లామర్ పరంగా ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. ఈ లేటెస్ట్ ఫోటోషూట్ లో ఆమె ధరించిన డ్రెస్ ఆమె పర్సనాలిటీకి పక్కాగా సెట్ అయింది. అతిగా మేకప్ లేకుండా, చాలా సింపుల్ గా కనిపిస్తూనే తన కళ్ళతో కొంటెగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా, శ్రీలీలకు ఉండే స్పెషల్ ఫ్యాన్ బేస్ వేరు.




ఆమె చిరునవ్వు, ఆ చురుకైన చూపులే ఆమెకు అతిపెద్ద ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. గ్లామర్ షో లో కూడా ఒక క్లాస్ టచ్ ఉండటం ఆమె స్పెషాలిటీ. కెరీర్ విషయానికి వస్తే, శ్రీలీల ప్రస్తుతం ఒక రిస్కీ ట్రాక్ లో ఉంది. ‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నా, బాక్సాఫీస్ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన కొన్ని సినిమాలు ఆమె కెరీర్ గ్రాఫ్‌ను కొంత తగ్గించాయి.




దాదాపు అరడజను సినిమాల్లో ఒకేసారి నటించడం వల్ల క్వాలిటీ మిస్ అయిందనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు స్క్రిప్ట్ సెలక్షన్ మీద ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. ఒక్క సరైన హిట్ పడితే మళ్ళీ శ్రీలీల హవా మొదలవ్వడం ఖాయం. శ్రీలీల ఇమేజ్ డ్యాన్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉండటం వల్ల, ఆమె కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆమెకు ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న పాత్రలు అవసరం.




ప్రస్తుతం సైన్ చేసిన కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తేనే లాంగ్ రన్ లో హీరోయిన్ గా నిలబడగలరు. టాలెంట్ కి కొదవ లేదు కాబట్టి, సరైన దర్శకుడు పడితే ఆమె విశ్వరూపం చూడొచ్చు. ఇక శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి అందరినీ పలకరించింది. కెరీర్ లో ఒడిదుడుకులు సహజం, కానీ వాటిని దాటుకుని నిలబడే సత్తా ఆమెకు ఉంది. రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటి, మళ్ళీ నెంబర్ వన్ రేసులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.