శ్రీలీల థై థండర్ షో: సోగ కాళ్ల సోయగానికి ఉక్కిరిబిక్కిరి
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తనదైన అందం, అద్భుతమైన డాన్స్ .. నటనతో ఇప్పటికే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
By: Sivaji Kontham | 9 April 2026 8:34 AM ISTటాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తనదైన అందం, అద్భుతమైన డాన్స్ .. నటనతో ఇప్పటికే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఈ బ్యూటీ తన సోగ కాళ్ల సొగసుతో అభిమానులను పరేషాన్ చేస్తోంది. శ్రీలీల షేర్ చేసిన ఈ `థై థండర్ షో` నెట్టింట మంటలు పుట్టిస్తోంది. ఈ కుర్రబ్యూటీ అందచందాలు చూసి నెటిజన్లు మతి చెడిపోతోందంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోలో శ్రీలీల వేసిన స్టెప్పులు, తన ఎక్స్‌ప్రెషన్స్ కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్నాయి.
ఈ వీడియోలో శ్రీలీల ధరించిన డ్రెస్ అత్యంత ప్రత్యేకంగా డిజైన్ చేసారు. పిక్కల పైకి తేలిపోయే పొట్టి మిడ్డీపై స్టైలిష్ క్రీమ్ కలర్ సూట్ ధరించి తాను మాత్రం ఇతరుల కంటే సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది. ఎక్కడికో ప్రయాణం అవుతూ విమానాశ్రయ టెర్మినల్‌లో మాస్క్ పెట్టుకుని కనిపిస్తున్నా కానీ.. ఈ భామ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగమ్మాయి అలా నడిచి వెళుతుంటే ఆ పొట్టి మిడ్డీ ఇంకా పైపైకి తేలిపోతూ థై సొగసులను ఎలివేట్ చేస్తోంది. మొత్తానికి శ్రీలీల ఇచ్చిన ఈ గ్లామర్ ట్రీట్ అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
శ్రీలీల ఫ్యాషన్ సెన్స్ చూస్తుంటే బాలీవుడ్ బ్యూటీలకు సైతం మతి చెడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బీ-టౌన్‌లోని జెన్ జెడ్ నటవారసురాళ్లు కుళ్లుకునే రేంజులో ఈ తెలుగమ్మాయి తనను తాను సిద్ధం చేసుకుంటోంది. ఈ భామ ఎంపిక చేసుకుంటున్న డిజైనర్ లుక్స్ .. క్యారీ చేస్తున్న విధానం ఫ్యాన్స్‌ను కిల్ చేస్తున్నాయి. కేవలం క్యూట్ లుక్స్‌కే పరిమితం కాకుండా.. ఇలాంటి బోల్డ్, స్టైలిష్ అప్పియరెన్స్‌తో తను గ్లోబల్ రేంజ్ బ్యూటీ అని నిరూపించుకుంటోంది.
కెరీర్ విషయానికి వస్తే.. శ్రీలీల ఇటీవల వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. మహేష్ బాబు సరసన నటించిన `గుంటూరు కారం` చిత్రంతో పాటు `ఆదికేశవ`, `ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్`, `స్కంద`, `భగవంత్ కేసరి` వంటి సినిమాల్లో నటించింది. ఈ చిత్రాల్లోని పాటల్లో శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తన ప్రతిభతో తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని టాలీవుడ్ `మోస్ట్ వాంటెడ్` హీరోయిన్‌గా ఎదిగింది.
శ్రీలీల తదుపరి చిత్రాల వివరాల్లోకి వెళితే.. ఇటీవల `ఉస్తాద్ భగత్‌సింగ్` విడుదలైంది. తదుపరి కొన్ని భారీ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. తన అందం, అభినయం.. అలుపెరగని ఎనర్జీతో శ్రీలీల మునుముందు మరిన్ని బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతోంది.
