అన్ కండీషన్లగా ఒకే చెప్పేసిందా?
తెలుగు హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో కలిసి రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ 'ఆషీకీ 3'లో నటిస్తోంది.
By: Srikanth Kontham | 6 Oct 2025 4:00 PM ISTతెలుగు హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో కలిసి రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ 'ఆషీకీ 3'లో నటిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రొమాన్స్ కాస్త ఘాటుగానే ఉంటుదని మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. ఆ ప్రాంచైజీ సక్సెస్ కి రొమాన్స్ కూడా కీలకం కావడంతో? ఆ అంశాన్ని టచ్ చేయకుండా సినిమా ఉండదనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈసినిమా సెట్స్ లో ఉండగానే శ్రీలీల మరో రెండు బాలీవుడ్ చిత్రాల్లో ఛాన్సులు అందుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కరణ్ జోహార్ కండీషన్లు నచ్చకా?
ఈ నేపథ్యంలో ఏకంగా జాన్వీ కపూర్ అవకాశాన్ని శ్రీలీల దక్కించుకుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. కరణ్ జోహార్ `దోస్తానా 2`కి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కార్తీక్ ఆర్యన్ తప్పుకున్న తర్వాత అదే పాత్రకు విక్రాంత్ మాస్సేను ఎంపిక చేసాడు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకున్నారు. అయితే ఇప్పుడా పాత్రకి జాన్వీ కపూర్ కి బధులుగా శ్రీలీల ఎంపికైందన్నది తాజా సమాచారం. కరణ్ తో సినిమా అనే సరికి జాన్వీ కొన్ని కండీషన్లు పెట్టిందిట. అందుకు కరణ్ అంగీకరించక పోవడంతో ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయిందన్నది ప్రాధమిక సమాచారం.
శ్రీలీల డేరింగ్ డెసిషన్:
ఇప్పుడు అదే పాత్రకు శ్రీలీల ఎంపికవ్వడంతో అన్ కండీషనల్ గా ప్రాజెక్ట్ కు సంతకం చేసిందని తెలుస్తోంది. ధర్మప్రొడక్షన్ కండీషన్లకు జాన్వీ ఒప్పుకోకపోయినా? శ్రీలీల ఒప్పుకుని ముందుకెళ్లడం సంచలనంగా మారింది. అయితే ఆ కండీషన్లు ఏంటి? అన్నది ఇంకా బయటకు రాలేదు. బాలీవుడ్ సినిమాలంటే రొమాంటిక్ యాంగిల్ తప్పనిసరి. కాకపోతే మిగతా పరిశ్రమల కంటే బాలీవుడ్ లో హద్దు మీరి రొమాన్స్ హైలైట్ అవుతుంది. ఈ క్రమంలో హీరోయిన్లు కూడా ఎలాంటి కండీషన్లు లేకుండా పని చేయాల్సి ఉంటుంది.
దిగ్విజయంగా పూర్తి చేసి బయటకు:
అందులోనూ కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ లో సినిమా అంటే? ఏ నటి అయినా సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కరణ్ ఎంత మాత్రం రాజీ పడడు. ఒకసారి జాయిన్ అయిన తర్వాత వెనక్కి తగ్గుతానంటే అంగీకరించడు. కార్తీక్ ఆర్యన్ తో కరణ్ కి ఇలాంటి వివాదమే తలెత్తింది. ఆ కారణంతోనే సగం షూటింగ్ చేసిన కార్తీక్ నే తప్పించి విక్రాంత్ మాస్సేని తీసుకున్నాడు. మరి అలాంటి కరణ్ తో శ్రీలీల పని చేస్తోంది. ఈ నేపథ్యంలో `దోస్తానా 2ని` శ్రీలీల దిగ్విజయంగా పూర్తి చేసి బయటకు రావాలని నెటి జనులు ఆకాంక్షిస్తున్నారు.
