Begin typing your search above and press return to search.

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

నటి శ్రీలీల ఈ ఏడాది దీపావళిని అమ్మమ్మ, తాతయ్య, తల్లితో కలిసి జరుపుకుంది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రెడ్ సిల్క్ చీరలో సంప్రదాయంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ఓ సినిమా, రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’లో కీలక పాత్ర పోషిస్తోంది.

By:  Madhu Reddy   |   10 Nov 2026 1:19 PM IST
స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!
X

సింప్లిసిటీకి ప్రతిరూపంగా.. క్యూట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీ లీల గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తన అద్భుతమైన అందంతో, అభినయంతో తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. భాషతో సంబంధం లేకుండా పలు భాషా చిత్రాలలో నటించి తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన విషయం తెలిసిందే. ఎంబిబిఎస్ కోర్స్ పూర్తి చేసిన ఈమె.. మరోవైపు తన ప్యాషన్ ను నిరూపించుకోవడానికి సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తెలుగు , తమిళ్ , హిందీ అంటూ పలు భాషలలో సినిమాలు చేస్తున్న ఈమె ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.




స్పెషల్ విఐపీ లతో శ్రీలీల దీపావళి సెలబ్రేషన్స్..

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటోషూట్ తో అభిమానులను అలరించే శ్రీ లీల అటు తన సినిమా విషయాలతో పాటు ఇటు ఫ్యామిలీ విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఫెస్టివల్స్ వస్తే చాలు తన ఫ్యామిలీతో కలిసి సందడి చేసే ఈమె తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ ను మాత్రం స్పెషల్ విఐపీ లతో జరుపుకున్నట్లు కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.




ఎవరా స్పెషల్ విఐపీలు..

ఇక ఎవరా స్పెషల్ విఐపీ లు అనే విషయానికి వస్తే.. శ్రీ లీల అమ్మమ్మ తాతయ్య.. తన తల్లితో కలిసి ఈ దీపావళి వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది శ్రీ లీల. తన అమ్మమ్మ తాతయ్యలతో కలిసి దిగిన ఫోటోలను, ఆప్యాయంగా గడిపిన క్షణాలను, తన తల్లితో షేర్ చేసుకున్న మధురానుభూతులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. మొత్తానికి అయితే దీపావళి వేడుకల్లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




చీరకట్టులో ఫిదా చేసిన శ్రీ లీల..

శ్రీ లీల షేర్ చేసిన ఫోటోలలో ఈమె అందం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ప్యూర్ రెడ్ రా సిల్క్ ప్లెయిన్ చీరకి గోల్డెన్ కలర్ బోర్డర్ తో చాలా అందంగా డిజైన్ చేసిన చీరను కట్టుకున్న ఈమె.. దీనికి కాంబినేషన్లో స్లీవ్ లెస్ నెక్ బౌ మోడల్ బ్లౌజ్ ధరించి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.




శ్రీ లీల ప్రస్తుత సినిమాలు..

చివరిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించిన ఈమె... ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ఒక ప్రాజెక్టులో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ధర్మన్ చిత్రంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది.