Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

టాలీవుడ్‌లో సినిమాలకు దూరంగా ఉండటంపై శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ముంబైలోని డి.వై. పాటిల్ యూనివర్సిటీలో మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల రెండేళ్లుగా కొత్త సినిమాలు అంగీకరించలేకపోయానని తెలిపింది. డాక్టర్ కావాలన్న తన కలను నెరవేర్చుకునేందుకే సినిమాలకు విరామం ఇచ్చానని, ధనుష్ ‘ఓం’ వంటి ప్రత్యేక ప్రాజెక్టులను మాత్రం ఎంపిక చేసుకున్నానని వెల్లడించింది.

By:  Srikanth Kontham   |   18 Nov 2026 3:23 PM IST
టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?
X

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా క‌నిపించిన శ్రీలీల ఒక్క‌సారిగా సైలెంట్ అయిన సంగ‌తి తెలిసిందే.వ‌చ్చిన అవ‌కాశాల‌ను సైతం కాద‌నుకుని బాలీవుడ్ కి వెళ్లిపోయింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కెరీర్ అక్క‌డే ప్లాన్ చేసుకుంటుంద‌ని మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కించాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు ఓ సినిమా ఈవెంట్ లో ఈ ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి చదువే ప్రధాన కారణమని తెలిపింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ముంబైలోని డి.వై.పాటిల్ యూనివర్సిటీలో మెడికల్ ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలిపింది.

డాక్టర్ కావాలనే చిరకాల కోరికను నెరవేర్చుకునే క్రమంలో ఇంటర్న్‌షిప్ కోసం ముంబైలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. వైద్య విద్యకు.. ప్రాక్టికల్ ఇంటర్న్‌షిప్‌కు హాజరుకావాల్సి రావడంతో సమయం పూర్తిగా అక్కడే గడిచిందని శ్రీలీల వివరించింది. `నేను ముంబైలో ఇంటర్న్‌షిప్ చేస్తుండటం వల్ల అక్కడ ఫిజికల్‌గా ఉండాల్సి వచ్చింది. అందుకే రెండేళ్లుగా కొత్త సినిమాలను అంగీకరిం చలేకపోయాను. అయితే ఆ సమయంలోనూ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లను మాత్రమే ఎంపిక చేసుకున్నానని.. అందులో ధనుష్ నటిస్తున్న `ఓం` ఒకటి` అని తెలిపింది.

దీంతో శ్రీలీల‌పై ఉన్న నెగిటివిటీపై కొంత సందేహం తొలిగిన‌ట్లు అయింది. తెలుగులో వ‌చ్చిన అవ‌కాశాలు కావాల‌ని వ‌దులుకోలేద‌ని ఆ స‌మ‌యంలో ఇంటెర్న్ షిప్ కోసం కొన్ని సినిమాలు త్యాగం చేయాల్సిన వ‌చ్చినప్పుడు తెలుగు సినిమాలు వ‌దులు కున్న‌ట్లు తెలుస్తోంది. అయితే వ‌దులుకునే ఛాన్సులేవో ఇత‌ర భాష‌ల నుంచే రిజెక్ట్ చేసి ఉంటే? బాగుండేది క‌దా? అన్న సందేహం లేక‌పోలేదు. అయితే పాత్ర‌ల ప‌రంగా ఇక్క‌డ కంటే ఆయా భాష‌ల్లో బ‌ల‌మైన అవ‌కాశాలు రావ‌డంతోనే అక్క‌డ క‌మిట్ అయి ఉండొచ్చు.

ఏదీ ఏమైనా ఇంట‌ర్నెషిప్ నుంచి రిలీవ్ అయింది కాబ‌ట్టి మ‌ళ్లీ య‌ధా విధిగా తెలుగు సినిమాల‌కు క‌మిట్ అవుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతానికి శ్రీలీల పూర్తిగా హిందీ, త‌మిళ సినిమాల‌కే క‌మిట్ అయింద‌ని లైన‌ప్ చూస్తే తెలుస్తోంది. మ‌రి కొత్త ఏడాది 2027 లో టాలీవుడ్ అప్ డేట్ ఏదైనా ఇస్తుందా? అన్న‌ది చూడాలి. అయితే టాలీవుడ్ నుంచి శ్రీలీల‌కు ఇంకా బ‌ల‌మైన పాత్ర‌లు ప‌డాల్సిన అవ‌సరం ఉంది. కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం చేస్తే? అమ్మ‌డు ట్యాలెంట్ నిరూపించుకునే అవ‌కాశం ఉండ‌దు. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లు ప‌డిన‌ప్పుడే తానేంటో నిరూపించు కోగ‌ల‌దు.