9 ఏళ్ల వయసులోనే ఇంత టాలెంట్.. అబ్బురపరుస్తున్న శ్రీలీల భరతనాట్యం వీడియో వైరల్!
ఈ వీడియో వెనుక ఒక చిన్న సరదా కథ ఉంది. కృష్ణాష్టమి రోజున శ్రీలీల తల్లి గారు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఈ పాత వీడియోను షేర్ చేశారట.
By: Madhu Reddy | 5 Sept 2026 11:55 AM ISTటాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నెటిజన్లకు ఒక సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తన చిన్ననాటి క్లాసికల్ డాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది. కేవలం 9 ఏళ్ల వయసులోనే ఆమె స్టేజ్ పై చూపించిన హావభావాలు, డాన్స్ మూమెంట్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ చిన్ననాటి టాలెంట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.ఆ విశేషాలు చూద్దాం..
కృష్ణాష్టమి స్పెషల్ వీడియో:
దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సెలబ్రెటీలు కూడా ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీలీల తన అభిమానులకు విషెస్ చెబుతూ ఒక అరుదైన భరతనాట్యం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ చిన్ననాటి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
3 ఏళ్లకే డాన్స్ ప్రాక్టీస్:
శ్రీలీలకు చిన్నతనం నుంచే డాన్స్ అంటే ఎంతో ఇష్టం. కేవలం 3 ఏళ్ల వయసులోనే ఆమె భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. క్రమశిక్షణతో సాధన చేసి, 8 ఏళ్ల వయసుకే తొలిసారి స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చి అందరినీ మెప్పించారు. ఇక ఆ చిన్న వయసులోనే క్లాసికల్ డాన్స్‌లో ఎంతో నైపుణ్యాన్ని సంపాదించారు.
వాట్సాప్ గ్రూప్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కి:
ఈ వీడియో వెనుక ఒక చిన్న సరదా కథ ఉంది. కృష్ణాష్టమి రోజున శ్రీలీల తల్లి గారు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఈ పాత వీడియోను షేర్ చేశారట. అది చూసిన శ్రీలీలకు ఎంతో ముచ్చట వేసి, వెంటనే తన అభిమానులతో పంచుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇక 9 ఏళ్ల వయసులో శ్రీకృష్ణుడి అల్లరి చేష్టలను నాట్యం ద్వారా ఆమె పండించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది.
రాకెట్ స్పీడ్‌తో స్టార్‌డమ్:
ఇక ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రీలీల, ‘ధమాకా’ హిట్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
డాక్టర్ చదువుతూనే నటన:
శ్రీలీల కేవలం నటన, నాట్యానికే పరిమితం కాలేదు. అటు మెడిసిన్ చదువుతూనే, ఇటు సినిమాల్లో నటిస్తూ రెండింటినీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది ఎట్టకేలకు డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన ఈమె ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటుంది. ఈ వీడియో చూశాక ఈ చిన్నదాని డాన్స్ పవర్ ఏంటో చిన్నప్పుడే నిరూపితమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ చూపించిన శ్రీలీల, ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతుండటం విశేషం. 9 ఏళ్ల వయసులో ఆమె ఇచ్చిన ఈ భరతనాట్యం ప్రదర్శన, కష్టపడే తత్వమే ఆమెను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని నిరూపిస్తోంది.
