శ్రీలీల వారిని చూసైనా జాగ్రత్త పడుతుందా?
ఈ నేపథ్యంలో శ్రీలీల చేతిలో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకటే సినిమా ఉంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్.
By: Sravani Lakshmi Srungarapu | 17 Feb 2026 6:00 PM ISTపెళ్లి సందడి 2తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. వరుస అవకాశాలతో అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్న ఈ యువ నటి, కెరీర్ ప్రారంభ దశలోనే భారీ క్రేజ్ సంపాదించుకుంది. అయితే హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా రావడం ఆమె కెరీర్ గ్రాఫ్‌పై ప్రభావం చూపిందన్న చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలీల చేతిలో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకటే సినిమా ఉంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్.
డాక్టర్ చదువును పూర్తి చేసిన శ్రీలీల
అయితే శ్రీలీల ఇన్నాళ్లూ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన డాక్టర్ చదువును పూర్తి చేసే పనిలో బిజీగా ఉండగా, రీసెంట్ గా చదువును పూర్తి చేసుకుని అమ్మడు డాక్టర్ పట్టాను పొందింది. చదువు అయిపోయింది కదా ఇక మళ్లీ తిరిగి తెలుగు ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుందనుకుంటే శ్రీలీల ఇతర భాషల సినిమాలపై దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది.
పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ
ఆల్రెడీ కోలీవుడ్ లో శివ కార్తికేయన్ పరాశక్తి మూవీతో అడుగుపెట్టిన శ్రీలీల, ఆ మూవీతో ఆశించిన కోలీవుడ్ డెబ్యూ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఆమెకు కోలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో శ్రీలీల ఎంపికవగా, రీసెంట్ గానే ఆ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ మూవీలో సాయి పల్లవితో కలిసి శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
బాలీవుడ్ డెబ్యూ కి రెడీ అవుతున్న శ్రీలీల
ధనుష్ మూవీ కాకుండా మరో సినిమాకు కూడా శ్రీలీల ఆల్మోస్ట్ ఓకే చెప్పిందని సమాచారం. ధృవ్ విక్రమ్ హీరోగా రాబోతున్న ఓ సినిమాలో శ్రీలీల నటించనుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వీలుంది. అదే నిజమైతే శ్రీలీల ఒకేసారి రెండు తమిళ సినిమాలతో బిజీ అవడం ఖాయం. మరోవైపు బాలీవుడ్ లో కూడా శ్రీలీల ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటూ హిందీలో ఇంకా సినిమాలు చేయడానికి శ్రీలీల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అదే జరిగితే శ్రీలీలకు టాలీవుడ్ లో గ్యాప్ రావడం ఖాయం. ఏదైనా ఒక ఇండస్ట్రీలో గ్యాప్ వస్తే ఆ తర్వాత తిరిగి పుంజుకోవడం కష్టం. ఇప్పటికే చాలా మంది విషయాల్లో ఇది ప్రూవ్ అయింది. రకుల్, రాశీ ఖన్నా, పూజా హెగ్డే ఇలా పలువురు భామలు టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్న టైమ్ లోనే వేరే ఇండస్ట్రీకి వెళ్లారు. కానీ అక్కడ అనుకున్న రీతిలో రాణించలేక మళ్లీ టాలీవుడ్ వైపే దృష్టి పెడుతున్నప్పటికీ సరైన ఆఫర్లు మాత్రం రావడం లేదు. ముందున్న వారిని చూసైనా శ్రీలీల తెలివిగా అడుగేస్తే బావుంటుందని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
