Begin typing your search above and press return to search.

మళ్లీ అదే తప్పు చేస్తున్న శ్రీ లీల.. టెన్షన్ లో ఫ్యాన్స్!

ఒకప్పుడు కథలను సరిగ్గా ఎంచుకోక వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకున్న శ్రీ లీల.. ఇప్పుడు మళ్లీ అదే దారిలోనే వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తోంది.

By:  Madhu Reddy   |   11 Oct 2025 1:08 PM IST
మళ్లీ అదే తప్పు చేస్తున్న శ్రీ లీల.. టెన్షన్ లో ఫ్యాన్స్!
X

శ్రీ లీల.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ సక్సెస్ రేట్ మాత్రం నిల్ అని చెప్పడంలో సందేహం లేదు. సాధారణంగా ఒకసారి దెబ్బతిన్న తర్వాత మరొకసారి కచ్చితంగా ఎవరైనా సరే కళ్ళు తెరుచుకుంటారు. కానీ శ్రీ లీలా మాత్రం మళ్లీ అదే తప్పు చేస్తూ అభిమానులను టెన్షన్లో పెట్టేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సందD అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది శ్రీ లీల.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ధమాకా సినిమాతో బ్లాక్ మాస్టర్ విజయాన్ని అందుకొని.. స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. ఎంత వేగంగా అయితే స్టార్ స్టేటస్ లభించిందో.. అంతే స్పీడుగా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు ఆమె ఖాతాలో పడ్డాయి. దీంతో శ్రీ లీల స్టోరీ సెలక్షన్ మీద, ఆమె యాక్టింగ్ మీద , క్యారెక్టర్ మీద పలు రకాల సెటైర్లు కూడా వినిపించాయి.

ధమాకా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈమెకు వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. అలా రామ్ పోతినేని తో స్కంద, బాలకృష్ణ హీరోగా నటించిన భగవంతు కేసరి సినిమాలో బాలయ్యకు కూతురుగా, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, నితిన్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, మహేష్ బాబుతో గుంటూరు కారం, గాలి కిరీటి రెడ్డితో జూనియర్ ఇలా దాదాపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇందులో భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నా.. ఈమె కెరియర్ కి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. చివరిగా వచ్చిన జూనియర్ సినిమాతో నైనా సక్సెస్ అందుకుంటుంది అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఇందులో 'వైరల్ వయ్యారి' పాట ఈమె నటనను ఊహించని రేంజ్ కు తీసుకెళ్లింది. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ఈమెకు వర్కౌట్ కాలేదు. పైగా పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ చేసింది.

ఇప్పుడేమో రవితేజ తో మాస్ జాతర అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కానీ ఈ సినిమా హడావిడి కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా హిందీలో ఆషికీ 3 అంటూ అక్కడి ప్రేక్షకులను పలకరించడానికి వెళ్లిన ఈమె.. మొదట్లోనే ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. దీనికి తోడు ఆషికి 3పై కూడా అక్కడ పెద్దగా అంచనాలు ఉన్నట్టు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు మళ్లీ తమిళంలో శివ కార్తికేయన్ తో పరాశక్తి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత మళ్లీ శివ కార్తికేయన్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో నటించబోయే సినిమాలో కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలే మదరాసి సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న శివ కార్తికేయన్.. ఇప్పుడు పరాశక్తితో రాబోతున్నారు. కనీసం ఈ సినిమా అయినా ఈమె కెరియర్ కు సక్సెస్ అందిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకప్పుడు కథలను సరిగ్గా ఎంచుకోక వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకున్న శ్రీ లీల.. ఇప్పుడు మళ్లీ అదే దారిలోనే వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తోంది. కనీసం ఇప్పటికైనా మంచి సబ్జెక్టును ఎంచుకుందా.. లేక మొదట్లో లాగే వరుస ఆఫర్లను అందుకొని డిజాస్టర్ లను మూటగట్టుకుంటుందా అనే విషయం తెలియాలి అంటే ఈ సినిమాలు తెరకెక్కే వరకు ఎదురు చూడాల్సిందే. మరి ఇప్పటికైనా అమ్మడు కాస్త ఆచితూచి అడుగు వేస్తే.. కెరియర్ ఉంటుందని.. లేకపోతే తిప్పలు తప్పవని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి శ్రీ లీల నిర్ణయం ఎలా ఉందో తెలియాలి అంటే ఈ సినిమాలో ఫలితాలు తెలియాల్సిందే.