రష్మిక బాటలో శ్రీలీల.. వర్కౌట్ అవుతుందా?
పేరుకే కన్నడ బ్యూటీ అయిన నేడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటూ స్టార్ హీరోల రికార్డులను సైతం చెరిపి వేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.
By: Madhu Reddy | 3 May 2026 3:00 PM ISTఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ పాత్రలకు లేదా హీరోని కాపాడడం, హీరోని ప్రేమించడం, హీరో కోసం త్యాగం చేయడం ఇలాంటి పాత్రలలోనే ఎక్కువగా నటించేవారు. కానీ కాలం మారుతోంది. ప్రేక్షకుడిలో అభిరుచులు మారుతున్నాయి. అందుకే హీరోయిన్స్ కూడా హీరోలకు తగ్గట్టుగా లేదా వారికి ధీటుగా వైవిద్య భరితమైన కథలను ఎంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక అలాంటి వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు రష్మిక. ఒకప్పుడు కేవలం హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఆ తర్వాత కాలంలో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటన విశ్వరూపాన్ని చూపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
పేరుకే కన్నడ బ్యూటీ అయిన నేడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటూ స్టార్ హీరోల రికార్డులను సైతం చెరిపి వేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈమె బాటలోనే మరో యంగ్ కన్నడ బ్యూటీ కూడా నడవాలని ఆశ పడుతోంది. సరైన ఛాన్స్ వస్తే తనను తాను నిరూపించుకుంటానని చెబుతోంది. ఆమె ఎవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీ లీల.. పెళ్లి సందD సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు అయితే రావడం లేదు.
అందులో భాగంగానే తెలుగులో నటించిన రాబిన్ హుడ్, మాస్ జాతర, రీసెంట్గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశ పరచడంతో అవకాశాలు కూడా దాదాపు తగ్గిపోయాయనే చెప్పాలి. అందుకే ప్రస్తుతం తమిళ చిత్రాలపై శ్రీ లీల దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది ఇకపోతే శ్రీ లీల తమిళంలో నటించిన తొలి సినిమా పరాశక్తి . ఈ సినిమా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మంచి గుర్తింపు లభించింది. ఇక అందుకే కోలీవుడ్ లోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అలా ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో కూడా ఒక సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ధనుష్ కి జోడిగా నటిస్తున్న నేపథ్యంలో ఇందులో ఈమె పాత్ర ఎలా ఉంటుంది అనే కామెంట్లు వ్యక్తం అవ్వగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కోరికను బయట పెట్టింది.
బలమైన సెంటిమెంట్ సన్నివేశాలతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రాలలో నటించాలనే ఆశను వ్యక్తం చేసింది. ముఖ్యంగా అలాంటి చిత్రాలు నటిగా తనలోని నటనను చూపిస్తాయని.. వైవిద్య భరిత కథ చిత్రాలలోనూ నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇక ఆ చిత్రాలే తన కెరియర్ను ముందుకు తీసుకెళ్తాయని నమ్ముతున్నట్లు శ్రీ లీలా తెలిపింది. ఇకపోతే రష్మిక కూడా ఇలా వైవిధ్యమైన కథ చిత్రాలలో నటించి ప్రేక్షకులలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక అందుకే శ్రీ లీల కూడా ఇలాంటి పాత్రలే కావాలని కోరుకుంటుంది. ఒకవేళ అలాంటి పాత్రలు లభిస్తే ఆ పాత్రలతో ఈమె ప్రేక్షకులను మెప్పిస్తుందా? అసలు అలాంటి పాత్రలు ఈమెకు వర్కౌట్ అవుతాయా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
