Begin typing your search above and press return to search.

శ్రీలీల బాలీవుడ్ గుట్టు విప్పిందిలా!

టాలీవుడ్ డాల్ శ్రీలీల తెలుగు సినిమాల్ని కాద‌ని బాలీవుడ్ చిత్రాల్ని లాక్ చేయ‌డంతో అమ్మ‌డిపై వ్య‌తిరే క‌త వ్య‌క్త‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   3 Sept 2025 4:00 PM IST
శ్రీలీల బాలీవుడ్ గుట్టు విప్పిందిలా!
X

టాలీవుడ్ డాల్ శ్రీలీల తెలుగు సినిమాల్ని కాద‌ని బాలీవుడ్ చిత్రాల్ని లాక్ చేయ‌డంతో అమ్మ‌డిపై వ్య‌తిరే క‌త వ్య‌క్త‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. అఖిల్ `లెనిన్` చిత్రం నుంచి త‌ప్పుకోవ‌డం స‌హా మ‌రో రెండు సినిమాల విష‌యంలో శ్రీలీల తీరుపై కాస్త అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. తెలుగు అమ్మాయి తెలుగు క‌థ‌ల్నే రిజెక్ట్ చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా వీటిపై శ్రీలీల వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. పాత్ర‌ల ఎంపిక విష‌యంలో త‌న‌కు భాష‌తో సంబంధం లేదంది.

ఈ మ‌ధ్య కాలంలో విన్న బాలీవుడ్ క‌థ‌లు త‌న‌ వాస్త‌వ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయ‌ని పేర్కొంది. అలాగే త‌న జీవితానికి ఆ పాత్ర‌లు క‌నెక్టింగ్ గా అనిపించినట్లు అభిప్రాయ‌ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కూ పోషించిన పాత్ర‌లు త‌న వ్య‌క్తి త్వానికి పూర్తి భిన్నంగానే ఉన్నాయంది. పాత్ర ఎలాంటిదైనా వ్య‌క్తిగత జీవితాన్ని ప్ర‌తిబింబించే పాత్ర‌ల్లో న‌టిస్తే ఆ మజా వేరుగా ఉంటుందంది. ఏ పాత్ర‌లోనైనా న‌టించ‌డానికి బధులు జీవించిన‌ప్పుడే నిజాయితీగా ప‌ని చేసిన‌ట్లు అనిపిస్తుదని అభిప్రాయ‌ప‌డింది. `ఆషీకీ 3` తో అమ్మ‌డు బాలీవుడ్ లో లాంచ్ అవుతోంది.

అందులో కార్తీక్ ఆర్య‌న్ కి జోడీగా న‌టిస్తోంది. `ఆషీకీ` ఓ రొమాంటిక్ మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీ. ఈ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన రెండు చిత్రాలు భారీ విజ‌యం సాధించాయి. హీరో-హీరోయిన్ మ‌ధ్య రొమాన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. `ఆషీకీ 3` లోనూ లెక్క‌కు మించి రొమాంటిక్ స‌న్నివేశాలున్నాయ‌నే ప్రచా రం ఇప్ప‌టికే జోరుగా సాగుతోంది. ఇంత వ‌ర‌కూ శ్రీలీల రొమాంటిక్ చిత్రాలు చేసింది లేదు. తెలుగులో ఆ త‌ర‌హా ఛాన్సులు త‌న‌కు రాలేదు. శ్రీలీల వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి ఈ జాన‌ర్ చిత్రాలంటే అమితాస‌క్తి చూపిస్తోంద‌ని తెలుస్తోంది.

అలాగే ప‌టౌడీ వార‌సుడు ఇబ్ర‌హీం అలీఖాన్ కు జోడీగానూ `దిలేరే` చిత్రంలో ఎంపికైన‌ట్లు ప్ర‌చారం జ‌రు గుతోంది. కొంత మంది బాలీవుడ్ భామ‌ల్ని ప‌రిశీలించిన అనంత‌రం డైరెక్ట‌ర్ కూనాల్ దేశ్ ముఖ్ వాళ్ల కంటే శ్రీలీల ఆ పాత్ర‌కు ప‌ర్పెక్ట్ సెట్ అవుతుంద‌ని ఎంపిక చేసిన‌ట్లు వినిపిస్తుంది. అయితే దీనికి సంబం ధించి ఇంకా ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. ఇక తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` లో న‌టిస్తోంది. దీంతో పాటు `మాస్ జాత‌ర‌`లో మ‌రోసారి ర‌వితేజ‌తో ఆడిపాడుతోంది. కోలీవుడ్ లో `పరాశ‌క్తి` అనే చిత్రంలో న‌టిస్తోంది.