శ్రీలీల బాలీవుడ్ మూవీ.. ఇన్ని ట్విస్టులు ఏంటో..?
సౌత్ లో ఆల్రెడీ తన టాలెంట్ తో మెప్పిస్తున్న శ్రీలీల ఇక్కడ సరిపోదు అన్నట్టు బాలీవుడ్ పై కూడా తన ఫోకస్ పెట్టింది. అమ్మడు ఇప్పటికే బాలీవుడ్ లో తన మొదటి సినిమా చేస్తుంది.
By: Ramesh Boddu | 9 Oct 2025 10:45 AM ISTసౌత్ లో ఆల్రెడీ తన టాలెంట్ తో మెప్పిస్తున్న శ్రీలీల ఇక్కడ సరిపోదు అన్నట్టు బాలీవుడ్ పై కూడా తన ఫోకస్ పెట్టింది. అమ్మడు ఇప్పటికే బాలీవుడ్ లో తన మొదటి సినిమా చేస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో జత కడుతున్న శ్రీలీల ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో వస్తుంది. అనురాగ్ బసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసి ఆషికి 3 అని అనుకున్నారు. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల సినిమా ఆషికి 3 అని ప్రచారం జరుగుతున్నా కూడా మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
శ్రీలీల తు మెరి జిందగి హై..
ఐతే దాదాపు ఆ సినిమాకు అదే టైటిల్ ఓకే అవుతుంది అనుకున్న టైం లో ఈ సినిమా టైటిల్ గా మరొకటి పరిగణలోకి తీసుకున్నారట. టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాకు ఫైనల్ గా తు మెరి జిందగి హై అనే టైటిల్ లాక్ చేశారట. ఐతే ఆషికి ఫ్రాంచైజీ టైటిల్ ని వాడుకోవడం వల్ల అనవసరమైన ఇష్యూస్ వస్తాయని అనురాగ్ బసు అండ్ టీం ఈ సినిమా టైటిల్ మార్చేశారట.
ఆషికి 2 సినిమా మోహిత్ సూరి 2013లో తీశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఐతే ఇప్పుడు ఈ సినిమాకు ఆషికి 3 అని పెడితే ఎలాగైనా ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. అందుకే తు మెరి జిందగి హై అనే టైటిల్ ని అనుకుంటున్నారట. శ్రీలీల హిందీ తొలి సినిమా విషయంలో జరుగుతున్న ఈ హంగామా ఆమెకు ప్లస్ అవుతుందనే చెప్పొచ్చు. ఈమధ్యనే మోహిత్ సూరి డైరెక్షన్ లో వచ్చిన సైయారా సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది.
కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల జోడీ..
ఇప్పుడు ఆ సినిమాను మించి ఈ మూవీ ఫలితాన్ని అందుకోవాలని చూస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల జోడీ అదిరిపోయిందని టాక్. బయటకు చెప్పట్లేదు కానీ శ్రీలీల ఈ సినిమా కోసం లిప్ లాక్స్ కూడా కానిచ్చేసిందని టాక్. మరి ఆషికి 3 గా ప్రచారంలో ఉన్న తు మెరి జిందగి హై సినిమా ఏమేరకు యూత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది అన్నది చూడాలి.
బాలీవుడ్ ఛాన్స్ వచ్చింది కదా అని సౌత్ సినిమాలు ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలను వదలకుండా అలా తన డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ శ్రీలీల అక్కడ ఇక్కడ సందడి చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో అమ్మడు నటించిన మాస్ జాతర సినిమా ఈ నెల చివర్లో రిలీజ్ అవుతుంది.
