బాలీవుడ్‌లో శ్రీలీల.. కార్తీక్ ఆర్యన్‌తో ముగించేసినట్టేనా?
టాలీవుడ్‌లో అత్యంత వేగంగా స్టార్‌డమ్ అందుకని క్రేజీ హీరోయిన్‌గా మారిన శ్రీలీల.. ఇప్పుడు అదే స్థాయిలో బాలీవుడ్‌లోనూ తన పాపులారిటీని పెంచుకుంటోంది.
By: Sivaji Kontham | 12 Sept 2026 7:51 AM ISTటాలీవుడ్‌లో అత్యంత వేగంగా స్టార్‌డమ్ అందుకని క్రేజీ హీరోయిన్‌గా మారిన శ్రీలీల.. ఇప్పుడు అదే స్థాయిలో బాలీవుడ్‌లోనూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. ఉత్తరాది ప్రేక్షకులను ప్రత్యేకించి జెన్ జీ యూత్‌ను మెచ్చే గ్లోబల్ స్టార్‌గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఆరంభంలోనే అవకాశం దక్కించుకుని.. అక్కడ వరుస అవకాశాలు అందుకునేందుకు సిద్ధమవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ .. ప్రతిభావంతుడైన దర్శకుడు అనురాగ్ బసు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ చిత్రం కోసం శ్రీలీల ఇటీవల తిరిగి ముంబైలో షూటింగ్ ప్రారంభించారు. పింక్‌విల్లా కథనం ప్రకారం.. శ్రీలీల తన సన్నివేశాల చిత్రీకరణను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి బిజీగా పాల్గొంటున్నారు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ తోనే ఈ బ్యూటీ హిందీ చిత్రసీమలో అధికారికంగా అడుగుపెడుతుండటం విశేషం.
ఇప్పటికే హీరో కార్తీక్ ఆర్యన్‌కు సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఈ చిత్రాన్ని ప్రఖ్యాత ఫ్రాంచైజీ అయిన `ఆషిఖి`కి కొనసాగింపు భాగంగా మీడియాలో భావించినా... ఇది ఆ ఫ్రాంచైజీకి ఎలాంటి సంబంధం లేని ఒక ప్యూర్ ఒరిజినల్ లవ్ స్టోరీ అని చిత్ర బృందం స్పష్టం చేసింది. తాజా కథనాల ప్రకారం ఈ చిత్రానికి `తూ మేరీ జిందగీ హై` అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ స్వరాలు సమకూరుస్తుండగా... కథనంలో పాటలే అత్యంత కీలకమైన పాత్రను పోషించనున్నాయి.
ఇక ఈ సినిమా కథాంశం విషయానికొస్తే... ఇది `ఆషికి` ఫ్రాంచైజీ భావజాలానికి దూరంగా... ఆధునిక కాలానికి తగినట్టుగా తీర్చిదిద్దిన తీవ్రమైన భావోద్వేగాలు, ప్రేమ, విరహం కలబోసిన ఒక సరికొత్త రొమాంటిక్ డ్రామాగా ఉండబోతోంది. `ఆషిఖి` సిరీస్‌లోని పాత మూస పద్ధతులను అనుసరించకుండా.. దర్శకుడు అనురాగ్ బసు తనదైన శైలిలో విజువల్ గ్రాండియారిటీ.. మ్యూజికల్ మ్యాజిక్ మేళవించి పూర్తిగా ఒక ఒరిజినల్ కథతో అందంగా రూపొందిస్తున్నారు. విడిపోయిన ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే భావోద్వేగ ప్రయాణం .. మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్ ఈ కథకు ప్రధాన బలమని సమాచారం.
శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్‌తో చేసిన `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంతో పాటు `ఓమ్ చాప్టర్ 1: ఉధిరం - ది బ్లడ్ వుడ్` అనే విభిన్నమైన ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు కార్తీక్ ఆర్యన్ లైనప్‌లో నాగ్‌జిల్లా, భూల్ భులయా 4 వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్నో అంచనాలు నెలకొల్పిన కార్తీక్-శ్రీలీలల ఈ భారీ మ్యూజికల్ లవ్ స్టోరీ 2026 నాటికి థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
