Begin typing your search above and press return to search.

ఈరోజు చాలా బాగా గ‌డిచింది.. శ్రీ‌లీల పోస్ట్ క్ష‌ణాల్లో వైర‌ల్

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది గ్లామర్ డాళ్‌ శ్రీలీల.

By:  Sivaji Kontham   |   7 July 2026 1:14 PM IST
ఈరోజు చాలా బాగా గ‌డిచింది.. శ్రీ‌లీల పోస్ట్ క్ష‌ణాల్లో వైర‌ల్
X

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది గ్లామర్ డాళ్‌ శ్రీలీల. కెరీర్ పరంగా ఎక్కడా తగ్గకుండా వరుస ప్రాజెక్టులతో ఈ బ్యూటీ దూసుకుపోతోంది. తనదైన అద్భుత అందం, చలాకీతనం, అంతకుమించిన డ్యాన్సింగ్ ప్రతిభతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ భారీగా ఆర్జిస్తూ నిరంతరం యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతి పోస్ట్ కేవలం క్షణాల వ్యవధిలోనే నెట్టింట విపరీతంగా వైరల్ అయిపోతోంది.





తాజాగా శ్రీలీల తన అధికారిక‌ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన కొన్ని అందమైన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తాజా పోస్ట్‌కు ఏ డే వెల్ స్పెంట్ (ఈరోజు చాలా బాగా గడిచింది) అంటూ ఒక క్యూట్ క్యాప్షన్‌ను జోడించారు. తెల్లటి హార్ట్ ఎమోజీని క్యాప్ష‌న్ కి జత చేయ‌గా.. ఈ లేటెస్ట్ సోషల్ మీడియా అప్‌డేట్ ప్రస్తుతం నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ లైకుల వర్షం కురిపిస్తోంది.





ఈ పోస్ట్ చూసిన మెజారిటీ నెటిజన్లు శ్రీలీల అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఈ పోస్ట్ లో గ్రూప్ ఫోటో చూడ‌గానే ఎంబిబిఎస్ శ్రీ‌లీల త‌న క్లాస్ మేట్ల‌తో ఫోటో దిగిందా? అంటూ ప‌లువురు నెటిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో అభిమానులు `బ్యూటీ క్వీన్`.. `డ్రీమ్ గర్ల్` అని కొనియాడుతుంటే.. మరికొందరైతే ఏకంగా `సౌత్ ఇండస్ట్రీస్ నెం.1 హీరోయిన్` అంటూ హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ స్పందిస్తూ.. భవిష్యత్తులో ఎప్పటికైనా మీతో కలిసి పని చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! అంటూ తన కలని వెల్లడించారు.





మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. శ్రీలీల నటిస్తూనే ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసిన‌ సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ కొందరు అభిమానులు ``నా గర్ల్‌ఫ్రెండ్ శ్రీలీల MBBS..``, ``సత్యా MBBS కి జాన్`` అంటూ చాలా సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం తమ కామెంట్లు హైలైట్ అవ్వడం కోసం, లైకులు రావడం కోసం రకరకాల వింత వింత కామెంట్లతో ఈ పోస్ట్ కింద హంగామా సృష్టిస్తున్నారు.





ఇక శ్రీలీల సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో కూడా పాగా వేసేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన న‌టిస్తున్న తదుపరి బాలీవుడ్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన కూడా ఒక భారీ మ్యూజిక‌ల్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ స‌ర‌స‌నా ఆర్.టి 75లో న‌టిస్తోంది. దీనిని డెబ్యూ ద‌ర్శ‌కుడు భాను తెర‌కెక్కిస్తున్నారు. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్‌లోనూ పలు క్రేజీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇరువైపులా పెద్ద ఇండస్ట్రీలను కవర్ చేస్తూ శ్రీలీల సాధిస్తున్న ఈ విజయ పరంపర త‌న స్థాయిని ఆవిష్క‌రిస్తోంది.