చీరలో శ్రీలీల గుబులు పుట్టించే ట్రీట్
తనదైన ప్రతిభతో ప్రజల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీలీల పోటీలో ఎందరు ఉన్నా తన రేంజ్ వేరే లెవల్ అని ప్రతిసారీ నిరూపిస్తోంది.
By: Sivaji Kontham | 27 Nov 2025 11:17 PM ISTతనదైన ప్రతిభతో ప్రజల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీలీల పోటీలో ఎందరు ఉన్నా తన రేంజ్ వేరే లెవల్ అని ప్రతిసారీ నిరూపిస్తోంది. ఈ బ్యూటీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ కెరీర్ పరంగా దూసుకెళుతోంది. అన్ని పరిశ్రమల్లోని టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
ఓవైపు కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా శ్రీలీల వరుస ఫోటోషూట్లతో అన్ లిమిటెడ్ ట్రీట్ ఇస్తోంది. 24 ఏళ్ల ఈ బ్యూటీ ఇప్పుడు చీరలో తన అందచందాలను ఎలివేట్ చేసిన తీరుకు కుర్రకారు సాహో అనేస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో గుబులు పెంచుతోంది. డార్క్ గ్రీన్ కలర్ శారీలో బీచ్ పరిసరాలలో ప్రత్యేకంగా ఈ ఫోటోషూట్ ని ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. సముద్రపు అంచున నల్లని మట్టి దిబ్బలపై సాహసోపేతంగా శ్రీలీల ఈ ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ యూనిక్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఆరంగేట్రమే కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల అవకాశం అందుకుంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాకు `తు మేరీ జిందగీ హై` అనే అధికారిక టైటిల్‌ను ఫిక్స్ చేసారు. ఆషిఖి తరహాలో అద్బుతమైన మ్యూజికల్ డ్రామా నేపథ్యంలో ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడం ఆసక్తికరం. మే 2026లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. 2025 చివరి నాటికి టాకీ పూర్తవుతుంది. పోస్ట్-ప్రొడక్షన్ పాటల చిత్రీకరణ 2026 ప్రారంభంలో జరుగుతుంది. మే 2026 లో సినిమాని విడుదల చేస్తారు. మరోవైపు శ్రీలీల టాలీవుడ్ లోను పలు క్రేజీ ప్రాజెక్టులకు కమిట్ అయింది. మాస్ జాతర ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ చిత్రాలలోను ఈ బ్యూటీ నటించనుంది.
కెరీర్ లో మొదటిసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన `ఉస్తాద్ భగత్‌సింగ్`లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ క్రేజీ సినిమాలో తన పాత్ర చిత్రణ కోసం శ్రీలీల ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తోంది. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించనున్నారు.
