ఇకపై శ్రీలీల కాదు.. డా.శ్రీలీల..
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ సాధించడంతో పాటు మెడికల్ డిగ్రీ పొందడం యూత్ కు ఆమె ఇన్స్పిరేషన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
By: M Prashanth | 11 Feb 2026 3:01 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనకంటూ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల మరో రేర్ ఫీట్ సాధించారు. సినిమా కెరీర్ తో పాటు ఎడ్యుకేషన్ కు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె మెడికల్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు. తాజాగా ఆమె ఎంబీబీఎస్ కోర్సు విజయవంతంగా కంప్లీట్ చేసి అఫిషియల్ గా డాక్టర్ గా మారారు.
ఈ మేరకు రీసెంట్ గా నిన్న జరిగిన కాన్వకేషన్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత చాలా మంది నటీనటులు చదువును మధ్యలో ఆపేస్తుంటారు! కానీ శ్రీలీల మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవైపు షూటింగ్స్, మరోవైపు పరీక్షలు, క్లినికల్ ట్రైనింగ్ లను ప్యారలల్ గా చేస్తూ చదువు పూర్తి చేశారు.
ఎంతో హార్డ్ గా ఉండే మెడికల్ కోర్సు పూర్తి చేయడం చిన్న విషయం కాదని, ఆమె పట్టుదలకు ఇది నిదర్శనమని ఇప్పుడు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీలీల చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండేదని, డాక్టర్ కావాలనే టార్గెట్ తో మెడిసిన్ కోర్సులో జాయిన్ అయిందని ఇప్పటికే పలుమార్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే సినిమాల్లో అవకాశాలు రావడం.. ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.
అయినప్పటికీ చదువును వదలకుండా రెండింటినీ సరైన విధంగా నిర్వహించడం ఆమె స్పెషాలిటీగా నిలిచింది. ఇటీవల కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె పరీక్షల సమయంలో షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి చదువుపై దృష్టి పెట్టిందని సమాచారం. ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు, ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు.
బ్యూటీ విత్ బ్రెయిన్, డాక్టర్ శ్రీలీల అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ సాధించడంతో పాటు మెడికల్ డిగ్రీ పొందడం యూత్ కు ఆమె ఇన్స్పిరేషన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. టార్గెట్ సరిగ్గా ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆమె నిరూపించిందని చెబుతున్నారు. ముఖ్యంగా చదువుతో పాటు ఇతర రంగాల్లో కెరీర్ కొనసాగించాలనుకుంటే విద్యార్థులకు శ్రీలీల ప్రయాణం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పాలి.
ప్రస్తుతం ఆమె చేతిలో పలు తెలుగుతోపాటు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇకపై మూవీలతో పాటు వైద్య సేవలపైనా ఆమె ఫోకస్ పెడుతుందా అనే విషయంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఏదేమైనా హీరోయిన్ గా మాత్రమే కాకుండా డాక్టర్ గానూ కొత్త గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీకి అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
