Begin typing your search above and press return to search.

జ‌నాల్ని ద‌త్త‌త తీసుకోమంటోన్న శ్రీలీల‌!

అనాధ పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకోవ‌డంలో సెల‌బ్రిటీలు ముందుంటారు. ఇప్ప‌టికే గ్రేట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి-ర‌మ దంప‌తు లు మ‌యూక అనే బాలిక‌ను ద‌త్త‌త తీసుకున్నారు.

By:  Srikanth Kontham   |   9 Jan 2026 9:00 PM IST
జ‌నాల్ని ద‌త్త‌త తీసుకోమంటోన్న శ్రీలీల‌!
X

అనాధ పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకోవ‌డంలో సెల‌బ్రిటీలు ముందుంటారు. ఇప్ప‌టికే గ్రేట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి-ర‌మ దంప‌తు లు మ‌యూక అనే బాలిక‌ను ద‌త్త‌త తీసుకున్నారు. కొంత కాలంగా మ‌యూకాను సొంత కుమార్తెలా చూసుకుంటున్నారు. న‌టుడు, ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫ‌ర్ రాఘవ లారెన్స్ 150 మంది పిల్లలను దత్తత తీసుకున్నాడు. వీరంద‌ర్నీ కంటికి రెప్ప‌లా చూసుకుంటున్నాడు. వారికి అవ‌స‌ర‌మైన అన్ని వ‌సుతులు స‌హా మంచి చ‌దువు చెప్పిస్తున్నాడు. వాళ్లంద‌ర్ని ప్ర‌యోజ‌కులుగా తీర్చి దిద్ది బ‌య‌ట‌కు పంప‌డ‌మే లారెన్స్ టార్గెట్.

బాలీవుడ్ న‌టి సుస్మితా సేను 25 ఏళ్ల క్రిత‌మే రెనీ సేన్‌ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఈ విష‌యంలో సుస్మితా సేన్ తండ్రి బాస‌ట‌గా నిలిచారు. త‌ల్లి వ‌ద్ద‌న్నా? సేవా దృక్ప‌ధంతో సుస్మితా సేన్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. అనంత‌రం 2010 లో అలీసా అనే మరో అమ్మాయిని అడాప్ట్ చేసుకుంన్నారు. సుస్మితా సేన్ క‌డుపున పుట్ట‌క‌పోయినా సొంత బిడ్డ‌ల ప్రేమ‌ను పంచు తుంది. స‌న్నిలియోన్ -డినియ‌ల్ వెబ‌ర్ దంప‌తులు కూడా నిషా కౌర్ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. అప్ప‌టికి నిషా నెల‌ల పాప‌. అయినా సొంత త‌ల్లిలా స‌న్నిలియోన్ సేవ‌లు చేసి పెద్ద‌దాన్ని చేస్తోంది.

స‌మంత , హాన్సిక స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ద‌త్త‌త పిల్ల‌ల‌ను క‌లిగి ఉన్నారు. ఈ విష‌యంలో తెలుగు న‌టి శ్రీలీల కూడా వాళ్ల‌కు త‌క్కువేం కాద‌ని ప్రూవ్ చేసింది. శ్రీలీల కూడా కొంత కాలంగా పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకుని వాళ్ల‌ని ప్ర‌యోజ‌కుల్నిచేస్తున్న‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా తొలిసారి అనుభ‌వాన్ని పంచుకుంది. పిల్లల‌ విష‌యంలో అప్పుడ‌ప్పుడు ఆందోళ‌న చెందుతాను. దూరంగా ఉంటున్నారు అనే బాధ క‌లుగుతుంది. కానీ వారు నాక‌న్నా బాగా చూసుకునే వారి ద‌గ్గ‌రే ఉన్నారు. అందుకు సంతోషంగానే అనిపిస్తుంద‌న్నారు.

క‌న్న‌డ సినిమా `కిస్` డైరెక్ట‌ర్ ఓ ఆశ్ర‌మానికి తీసుకెళ్లిన‌ప్పుడు అక్క‌డే ఈ పిల్ల‌లంతా ఉండేవారు. అక్క‌డ నుంచి తాను తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. పిల్ల‌ల‌కు దూరంగా ఉన్నా రోజూ వారితో ఫోన్ లో త‌ప్ప‌క మాట్లాడుతానంది. ఈ విష‌యాలు ఎప్ప‌టిక బ‌య‌ట‌కు తెలియ‌కూడ‌ద‌నే చెప్ప‌లేదు. కానీ నాలాంటి వారు ఓపెన్ అయితే మ‌రింత మంది ఇంకొంత మంది పిల్ల‌ల్ని ద‌త్త తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఓపెన్ అయ్యానంది. తానేదో గొప్ప ప‌నిచేసాన‌ని కాద‌ని జ‌నాలు కూడా ఆ దిశ‌గా ఆలోచిస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌స్తుతం శ్రీలీల బాలీవుడ్ స‌హా టాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.