Begin typing your search above and press return to search.

శ్రీ విష్ణు 'విన్యాసం'.. సోలో ఛాన్స్ యూజ్ చేసుకుంటుందా?

వరుస హిట్స్ తో మంచి జోష్‌ లో ఉన్న టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By:  M Prashanth   |   21 Feb 2026 4:27 PM IST
శ్రీ విష్ణు విన్యాసం.. సోలో ఛాన్స్ యూజ్ చేసుకుంటుందా?
X

వరుస హిట్స్ తో మంచి జోష్‌ లో ఉన్న టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం విష్ణు విన్యాసం విడుదల తేదీని మేకర్స్ ముందుకు జరిపారు. ఫిబ్రవరి 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఆ సినిమాను ఇప్పుడు ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.




నిజానికి శ్రీ విష్ణు సినిమాలు అంటే నేచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా ఉంటాయన్నది ప్రేక్షకుల అభిప్రాయం. అదే స్టైల్‌ లో విష్ణు విన్యాసం కూడా కంప్లీట్ ఫన్నీ ప్యాకేజ్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మూఢనమ్మకాలు, జ్యోతిష్యం, శకునాలు వంటి విషయాలను ఎక్కువగా నమ్మే వ్యక్తిగా సినిమాలో శ్రీ విష్ణు కనిపించనున్నారు. ఆ నమ్మకాల వల్ల ఆయన జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తోంది.

కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా సినిమాలో ఉండనున్నాయని సమాచారం. ఇటీవల విడుదలైన టీజర్‌ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీ విష్ణు డైలాగులు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక పాటలు కూడా యూత్‌ ను అలరిస్తున్నాయి. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ తో పాటు యూత్ ను ఆకర్షించేలా చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. అదే వారంలో శ్రీ విష్ణు నటించిన మరో సినిమా మృత్యుంజయ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ చిత్రం వాయిదా పడటంతో విష్ణు విన్యాసం మూవీకి సోలో రిలీజ్ అవకాశం దక్కింది. ఆ ఛాన్స్ ను వినియోగించుకుని ముందుగానే విడుదల చేస్తే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వస్తాయని నిర్మాతలు భావించి రిలీజ్ డేట్‌ ను మార్చినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. హీరోయిన్‌ గా నయన్ సారిక నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండనుందని సమాచారం. శ్రీ విష్ణుతో ఆమె జోడీ సిల్వర్ స్క్రీన్ పై కొత్త ఫీల్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. సినిమాను యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించగా, నిర్మాతగా సుమంత్ నాయుడు జి వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, స్టోరీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని వినికిడి.

ఏదేమైనా వరుస హిట్లతో దూసుకుపోతున్న శ్రీ విష్ణు నుంచి వస్తున్న విష్ణు విన్యాసం సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విడుదల తేదీ ప్రీ పోన్ అవ్వడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానున్న విష్ణు విన్యాసం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో.. ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో.. సోలో రిలీజ్ ఛాన్స్ ను ఎంతవరకు యూజ్ చేసుకుంటుందో వేచి చూడాలి.