శ్రీ విష్ణు.. సరిపోతుందా గ్యాప్?
టాలీవుడ్ యంగ్ హీరో, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
By: M Prashanth | 21 Feb 2026 1:30 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు పలు మూవీల్లో యాక్ట్ చేస్తున్న ఆయన.. ఒకే సమయంలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవ్వడం హాట్ టాపిక్ గా మారింది! నిర్మాతల్లో, అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.
శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా రిలీజ్ కు కేవలం ఒక రోజు తేడాతో ఆయన మరో చిత్రం మృత్యుంజయ్ థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయింది. దీంతో ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లో రిలీజ్ అయితే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ప్రేక్షకులు కూడా ఏ సినిమాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనే కన్ఫ్యూజన్ లో పడే పరిస్థితి వస్తుంది.
దీంతో రెండు చిత్రాల్లో ఒక సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మృత్యుంజయ్ మూవీని వారం రోజుల పాటు వాయిదా వేస్తూ, మార్చి 6వ తేదీకి రిలీజ్ డేట్ మార్చేశారు. దీంతో విష్ణు విన్యాసం మూవీకి సోలో రన్ దొరికే ఛాన్స్ వచ్చింది. కనీసం ఫస్ట్ వీక్ పూర్తి స్థాయిలో స్క్రీన్స్ దక్కేలా అలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఒకే హీరోకి చెందిన రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లో వస్తే ఓపెనింగ్స్ డివైడ్ అవుతాయి.
ముఖ్యంగా శ్రీ విష్ణు వంటి మిడ్ రేంజ్ హీరోలకు ఓపెనింగ్స్ చాలా కీలకం. ఫస్ట్ వీక్ కలెక్షన్లే సినిమా రిజల్ట్ ను నిర్ణయించే రోజుల్లో.. ఒక మూవీ రిలీజ్ డేట్ మార్చడం మంచి నిర్ణయంగా సినీ ప్రియులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో విష్ణు విన్యాసం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వారం రోజుల్లోనే స్ట్రాంగ్ వసూళ్లు సాధించగలదు. ఆ తర్వాత మృత్యుంజయ్ మూవీకి కూడా కొత్తగా ప్రేక్షకులు రావచ్చు.
అయితే ఆ గ్యాప్ సరిపోతుందా అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్ద సినిమాలు లేదా పండుగ సీజన్ రిలీజ్ లు మధ్యలో ఉంటే ప్రభావం ఉండొచ్చు. అదే విధంగా మొదటి సినిమా రిజల్ట్ రెండో సినిమాపై కూడా ప్రభావం చూపుతుంది. ఒకటి హిట్ అయితే మరోదానికి హైప్ పెరుగుతుంది. ఫ్లాప్ అయితే మాత్రం నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది.
శ్రీ విష్ణు గతంలో చేసిన కంటెంట్ బేస్డ్ సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. అందుకే రెండు కొత్త చిత్రాలపైనా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. స్టోరీ, ప్రమోషన్స్, మౌత్ టాక్.. చిత్రాల రిజల్ట్ డిసైడ్ చేస్తాయి. ఓవరాల్ గా మృత్యుంజయ్ రిలీజ్ డేట్ చేంజ్ వల్ల శ్రీ విష్ణుకు కొంత రిలీఫ్ దక్కింది. కానీ అసలు పరీక్ష మాత్రం బాక్సాఫీస్ వద్ద ఉండనుంది. మరి శ్రీ విష్ణు రెండు కొత్త సినిమాలు ఎలాంటి రిజల్ట్ సాధిస్తాయో వేచి చూడాలి.
