Begin typing your search above and press return to search.

సైలెంట్‌గా కొడుతున్నాడు.. నిర్మాతలకు కావాల్సింది ఇలాంటి హీరోనే..

ఒక్క హిట్ పడగానే రొటీన్ మాస్ ఇమేజ్ కోసం పరిగెత్తకుండా తన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అయ్యే కథలనే ఎంచుకుంటున్నారు.

By:  M Prashanth   |   19 Oct 2026 7:19 PM IST
సైలెంట్‌గా కొడుతున్నాడు.. నిర్మాతలకు కావాల్సింది ఇలాంటి హీరోనే..
X

బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల పోస్టర్లు, భారీ ఓపెనింగ్స్ హడావుడి లేకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు హీరో శ్రీవిష్ణు. కంటెంట్‌ను నమ్ముకుని వరుసగా క్లీన్ హిట్లు కొడుతూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. రీసెంట్‌గా రిలీజైన 'కామ్రేడ్ కళ్యాణ్'తో మరో సాలిడ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ అసలు విశేషం హిట్ల సంఖ్య కాదు, శ్రీవిష్ణు సినిమా కొంటే పెట్టిన పెట్టుబడికి ఢోకా ఉండదనే నమ్మకం బయ్యర్లలో, నిర్మాతల్లో బలంగా నాటుకుపోవడం.

ఇండస్ట్రీలో గ్రాస్ కలెక్షన్ల కంటే నిర్మాత జేబులోకి చేరే అసలు లాభమే ముఖ్యం. కథకు తగ్గ బడ్జెట్, దానికి తగ్గ మార్కెట్ పరిధిని పక్కాగా బ్యాలెన్స్ చేయడంలో శ్రీవిష్ణు రూటే వేరు. ప్రాజెక్ట్ పట్టాలెక్కే ముందే రిస్క్ ఎంత అనే లెక్కపై క్లారిటీ ఉండటంతో ఆయన సినిమాలు సేఫ్ వెంచర్లుగా మారుతున్నాయి. అందుకే ఎలాంటి ఆర్భాటాలు లేకపోయినా టాలీవుడ్‌లో మోస్ట్ ప్రాఫిటబుల్ అండ్ బ్యాంకబుల్ హీరోల్లో ఒకరిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నారు.

ఒక్క హిట్ పడగానే రొటీన్ మాస్ ఇమేజ్ కోసం పరిగెత్తకుండా తన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అయ్యే కథలనే ఎంచుకుంటున్నారు. కామెడీ టైమింగ్‌తో నవ్వించే హీరోగా పేరున్నా, కేవలం ఆ ఒక్క జానర్‌కే పరిమితం కావడం లేదు. కథలో దమ్ముంటే ఆడియన్స్ థియేటర్లకు వస్తారనే నమ్మకంతోనే వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో 'ఫ్యామిలీ ప్యాక్' అనే సినిమా చేస్తున్నారు. టైటిల్‌తోనే ఇదొక అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ అని హింట్ ఇచ్చేశారు. శ్రీవిష్ణు మార్క్ కామెడీ టైమింగ్‌కు ఇందులో ఫుల్ స్కోప్ ఉండబోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రాబోతున్న ఈ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ లాంటి బడా బ్యానర్ ఎలా ప్రజెంట్ చేస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

మరోవైపు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేస్తున్న ప్రాజెక్ట్ దీనికి పూర్తి భిన్నంగా ఉండబోతోంది. నిజజీవితంలో జరిగే సంఘటనలు, నిజ జీవితాలకు అద్దం పట్టే కంటెంట్ డ్రివెన్ కథతో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి రెండు టాప్ బ్యానర్లలో ఒకటి ఎంటర్టైన్మెంట్ మూవీ, మరొకటి రియలిస్టిక్ మూవీ ఎంచుకోవడం చూస్తుంటే ఆయన ప్లానింగ్ ఎంత షార్ప్‌గా ఉందో అర్థమవుతోంది.

వరుస సక్సెస్‌లతో శ్రీవిష్ణు మార్కెట్ గ్రాఫ్ పెరుగుతుండగా, లైనప్ కూడా అంతే ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మైత్రీ మూవీ మేకర్స్, మరోవైపు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి బడా సంస్థలు ఆయన వెనుక ఉన్నాయి. మినిమమ్ గ్యారెంటీ హీరోగా తెచ్చుకున్న గుర్తింపు ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్‌కు పెద్ద ప్లస్ కానుంది. మరి ఈ గోల్డెన్ ఫేజ్‌ను శ్రీవిష్ణు ఏ రేంజ్‌లో వాడుకుంటారో చూడాలి.