స్పెషల్ రెస్టోను ప్రారంభించిన శ్రీవిష్ణు.. ఎవరిదో తెలుసా?
అయితే షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్న శ్రీవిష్ణు.. తాజాగా ప్రీమియం ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు.
By: M Prashanth | 14 Dec 2025 6:15 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో, కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు గురించి అందరికీ తెలిసిందే. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. వైవిధ్యమైన కథలతో రూపొందుతున్న సినిమాల్లో యాక్ట్ చేస్తూ మూవీ లవర్స్ ను అలరిస్తూనే ఉంటారు. ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించిన ఆయన.. ఇప్పుడు వివిధ చిత్రాల్లో నటిస్తున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.
అయితే షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్న శ్రీవిష్ణు.. తాజాగా ప్రీమియం ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన శుద్ధ్ విలాస్ రెస్టోను స్టార్ట్ చేశారు. దీంతో రెస్టారెంట్ వద్దకు వెళ్లిన శ్రీవిష్ణును చూసేందుకు స్థానికులు, సినీ ప్రియులు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.
రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి శుద్ధ్ విలాస్ యజమానులు శశికాంత్, శ్రీరామ్ తో పాటు పలువురు ప్రముఖులు అటెండ్ అయ్యారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, రచయిత కోన వెంకట్ హాజరయ్యారు. అయితే సంప్రదాయ బద్ధంగా రెస్టారెంట్ ను ప్రారంభించిన శ్రీవిష్ణు, ఆ తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
శుద్ధ్ విలాస్ రెస్టారెంట్ వెనుక ఉన్న దార్శనికతను శ్రీవిష్ణు ప్రశంసించారు. నేటి వేగవంతమైన సిటీ జీవనశైలిలో పరిశుభ్రమైన, ప్రామాణికమైన, ఆరోగ్యకరమైన శాకాహార భోజనానికి పెరుగుతున్న డిమాండ్ ను ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు శుద్ధ్ విలాస్.. వెజిటేరియన్స్ కు బెస్ట్ స్పాట్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత రెస్టారెంట్ యజమానులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే సంప్రదాయబద్ధమైన శాకాహార వంటకాలను అందిస్తామని యజమానులు శశికాంత్, శ్రీరామ్ తెలిపారు. ప్యూరిటీ, క్వాలిటీ తో పాటు కస్టమర్ సాటిస్ఫికేషన్ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ లో బ్రాంచెస్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
అయితే రెస్టారెంట్ ఓపెనింగ్ తర్వాత.. అక్కడి వచ్చిన అతిథులు, ప్రముఖులతో శ్రీవిష్ణు మాట్లాడారు. అందరినీ నవ్వుతూ పలకరించారు. రెస్టారెంట్ యజమానులను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ తర్వాత రెస్టారెంట్ సిగ్నేచర్ డిషెస్ టేస్ట్ చూశారు. చాలా బాగున్నాయని కొనియాడారు. మొత్తానికి శ్రీవిష్ణు రాకతో శుద్ధ విలాస్ ఓపెనింగ్ సందడిగా జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన అభిమానులు తమ హీరోను చూసి ఖుషీ అయిపోయారని చెప్పాలి.
