Begin typing your search above and press return to search.

మైత్రీ, గీతపై 'విష్ణు' డైలాగ్స్.. వాటి వెనుక పెద్ద ప్లాన్?

హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా సక్సెస్ మీట్ రీసెంట్ గా జరగ్గా.. విష్ణు పాల్గొన్నారు. మూవీలోని డైలాగ్స్, పంచ్ లైన్స్ విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు.

By:  M Prashanth   |   28 Feb 2026 4:07 PM IST
మైత్రీ, గీతపై విష్ణు డైలాగ్స్.. వాటి వెనుక పెద్ద ప్లాన్?
X

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు లీడ్ రోల్ లో నటించిన విష్ణు విన్యాసం మూవీ మంచి రెస్పాన్స్ అందుకుని సందడి చేస్తోంది. హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా సక్సెస్ మీట్ రీసెంట్ గా జరగ్గా.. విష్ణు పాల్గొన్నారు. మూవీలోని డైలాగ్స్, పంచ్ లైన్స్ విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నిజానికి.. శ్రీ విష్ణు సినిమాల్లోని డైలాగ్స్, పంచ్ లైన్స్.. అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో జరిగిన సంఘటనలను పరోక్షంగా ప్రస్తావిస్తారు. పలువురు సినీ సెలబ్రిటీలపై డైలాగ్స్ తో పాటు పంచ్ లు వేస్తుంటారు. ఇప్పుడు విష్ణు విన్యాసంలో కూడా అదే జరగ్గా.. తనపై తాను కూడా విష్ణు పంచ్ లు వేసుకోవడం గమనార్హం. ఇప్పుడు ఆ విషయానికి నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు.

ఆ తర్వాత 'సినిమాలో నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు గీతా ఆర్ట్స్ పై మీద పంచెస్ వేశారు కదా?' అని అడగ్గా.. మైత్రీ, గీతా ఆర్ట్స్ మీద పొగుడుతూ వేశామని శ్రీ విష్ణు తెలిపారు. నెక్స్ట్ వాళ్లతో తన సినిమాలు ఉన్నాయి కాబట్టి, ప్రమోషన్స్ ఇప్పటి నుంచి మొదలుపెట్టానని నవ్వుతూ అన్నారు. అదే సమయంలో తన స్పాంటేనియస్ డైలాగ్స్ కోసం మాట్లాడారు.

'డైలాగ్స్ స్క్రిప్ట్ లో కాకుండా కొన్ని డైరెక్ట్ చెబుతారా' అని అడగ్గా.. అదే కదా పెర్ఫార్మెన్స్ అని చెప్పారు శ్రీవిష్ణు. అది చేయడానికి తమను పెట్టుకున్నారని అన్నారు. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఎంటర్టైన్ చేయాలని తెలిపారు. అయితే శ్రీవిష్ణు ఎప్పటిలాగే సినిమాలో తనదైన విభిన్నమైన కామెడీ టైమింగ్ తో అలరించారని అంతా చెబుతున్నారు. తన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశారని అంటున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. నయన సారిక హీరోయిన్‌ గా నటించారు. యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించిన ఆ మూవీని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుబ్రహ్మణ్యం నాయుడు, సుమంత్ నాయుడు జీ నిర్మించారు. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా తగ్గకుండా రూపొందించారు. సుమారు రూ.19 కోట్ల వ్యయంతో తీసినట్లు తెలుస్తోంది.

మూవీలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరించారు. రాదన్ సంగీతం అందించారు. కార్తీకేయన్ రోహిణి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 27వ తేదీన విష్ణు విన్యాసం మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది.