Begin typing your search above and press return to search.

నెట్‌ఫ్లిక్స్ vs అమెజాన్.. నలిగిపోతున్న శ్రీవిష్ణు!

యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానుండడం ఇప్పుడు టాలీవుడ్‌ లో హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   12 Feb 2026 3:26 PM IST
నెట్‌ఫ్లిక్స్ vs అమెజాన్.. నలిగిపోతున్న శ్రీవిష్ణు!
X

యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానుండడం ఇప్పుడు టాలీవుడ్‌ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక హీరోకు చెందిన ఒక సినిమా రిలీజ్ అయితేనే మార్కెట్, కలెక్షన్లు, స్క్రీన్ల విషయంలో ఎన్నో లెక్కలు వేస్తారు. కానీ శ్రీవిష్ణు యాక్ట్ చేస్తున్న రెండు సినిమాలు ఒకే తేదీకి రావడం ఇప్పుడు నిర్మాతలకే కాకుండా అభిమానుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.

శ్రీవిష్ణు లీడ్ రోల్ లో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ ఫిబ్రవరి 27వ తేదీన విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌ తో రూపొందిన ఆ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్, పోస్టర్లకు సూపర్ రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. ముఖ్యంగా శ్రీవిష్ణు డిఫరెంట్ రోల్‌ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే అదే రోజు ఆయన మరో సినిమా విష్ణు విన్యాసం కూడా విడుదలకు సిద్ధమవుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిందని సమాచారం. పూర్తిగా భిన్నమైన జానర్‌ లో రూపొందిన ఆ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం సస్పెన్స్ నెలకొంది.

అదే సమయంలో విష్ణు డబుల్ రిలీజ్ కు ఓటీటీ ప్లాట్‌ ఫామ్ల మధ్య పోటీ ప్రధాన కారణమని సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. మృత్యుంజయ్ డిజిటల్ హక్కులు నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, విష్ణు విన్యాసం రైట్స్ అమెజాన్ ప్రైమ్ వద్ద ఉన్నాయి. దీంతో రెండు సంస్థలు కూడా తమ సినిమాలకు అదే తేదీన థియేట్రికల్ రిలీజ్ ఉండాలని పట్టుబడుతున్నాయట. అందుకే నిర్మాతలు ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది.

ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు డివైడ్ అవ్వడం ఖాయం. ఆడియన్స్ కూడా ఏ సినిమా చూడాలా అన్న కన్ఫ్యూజన్ లో పడే ఛాన్స్ ఉంది. ఇది రెండు చిత్రాలకూ మైనస్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ముఖ్యంగా ఓపెనింగ్స్‌ పై ప్రభావం పడితే సినిమా రన్‌ పై కూడా దెబ్బ పడే ఛాన్స్ ఉంది.

అయితే టాలీవుడ్‌ లో ఓటీటీ సంస్థల ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. రిలీజ్ డేట్స్, డిజిటల్ ఒప్పందాలు కూడా సినిమాల ప్లాన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు శ్రీవిష్ణు సినిమాల విషయంలో ఇది క్లియర్ గా కనిపిస్తోంది. మరి నెట్‌ ఫ్లిక్స్ vs అమెజాన్ ప్రైమ్ లో చివరికి ఏ సినిమా వెనక్కి తగ్గుతుందో.. లేక రెండూ ఒకేసారి రిలీజ్ అవుతాయో అన్నది వేచి చూడాలి. ఒకవేళ అదే రోజు విడుదలైతే శ్రీవిష్ణుకు లాభమా? నష్టమా? అన్నది రిజల్ట్స్ చెబుతాయి!