నారీ నారీ నడుమ టాలెంటెడ్ హీరో
ఈ ఇయర్ సంక్రాంతి పోటీ మామూలుగా ఉండటం లేదు. ఐదారు సినిమాలకు పైగా ఈ పండక్కి రిలీజవుతుండటంతో పాటూ వేటికవే సపరేట్ క్రేజ్ ను కలిగి ఉన్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 4 Jan 2026 1:27 PM ISTఈ ఇయర్ సంక్రాంతి పోటీ మామూలుగా ఉండటం లేదు. ఐదారు సినిమాలకు పైగా ఈ పండక్కి రిలీజవుతుండటంతో పాటూ వేటికవే సపరేట్ క్రేజ్ ను కలిగి ఉన్నాయి. రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు లాంటి సినిమాలతో పాటూ అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి లాంటి సినిమాలు కూడా ఈ పండగ రేసులో ఉండటంతో మూవీ లవర్స్ ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.
శర్వానంద్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న శ్రీవిష్ణు
వీటిలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా నారీ నరీ నడుమ మురారి. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటూ మరో టాలెంటెడ్ హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అతనే శ్రీవిష్ణు. నారీ నారీ నడుమ మురారి సినిమాలో శ్రీ విష్ణు కూడా నటిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ ఓ చిన్న గ్లింప్స్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ గ్లింప్స్ లో శ్రీవిష్ణు ఒక లగ్జరీ కార్ లో చాలా స్టైలిష్ గా కనిపించి సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎగ్జైట్‌మెంట్ ను మరింత పెంచారు.
సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు
నారీ నారీ నడుమ మురారి సినిమాకు డైరెక్టర్ రామ్ అబ్బరాజు. ఇతని దర్శకత్వంలో గతంలో వచ్చిన సామజవరగమన మంచి హిట్ అవడంతో పాటూ ఆ సినిమాలో హీరో శ్రీ విష్ణునే అవడం వల్ల, ఈ సినిమాలో క్యారెక్టర్ గురించి అడగ్గానే ఆయన ఒప్పుకున్నారని సమాచారం. మొత్తానికి సంక్రాంతి బరిలోకి ఇప్పుడు శ్రీ విష్ణు కూడా సడెన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
జనవరి 14న నారీ నారీ నడుమ మురారి
అటు శ్రీవిష్ణుకి, ఇటు శర్వానంద్ కి మంచి కామెడీ టైమింగ్ ఉండటంతో వీరిద్దరి కలయికలో ఎలాంటి సీన్స్ వస్తాయో అని చూడ్డానికి అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తుండగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. సంక్రాంతి కానుకగా నారీ నారీ నడుమ మురారి జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
