Begin typing your search above and press return to search.

మంచి సినిమానే కానీ..

టాలీవుడ్ యువ కథానాయకుడు శ్రీ విష్ణు వారం వ్యవధిలో రెండు చిత్రాలతో పలకరించాడు. గత నెల చివర్లో అతడి నుంచి ‘విష్ణు విన్యాసం’ వచ్చింది.

By:  Garuda Media   |   10 March 2026 7:00 PM IST
మంచి సినిమానే కానీ..
X

టాలీవుడ్ యువ కథానాయకుడు శ్రీ విష్ణు వారం వ్యవధిలో రెండు చిత్రాలతో పలకరించాడు. గత నెల చివర్లో అతడి నుంచి ‘విష్ణు విన్యాసం’ వచ్చింది. ఈ మధ్య వరుసగా కామెడీ సినిమాలు తీస్తున్న శ్రీ విష్ణు.. ఆ స్టైల్లోనే ఈ చిత్రం కూడా చేశాడు. కానీ కంటెంట్ బలంగా లేకపోవడంతో ఈ మూవీ వీకెండ్లోనే చల్లబడిపోయింది. ‘సింగిల్’ తర్వాత శ్రీ విష్ణు జోరుకు ఈ సినిమా బ్రేక్ వేసింది. ఐతే ఇంకో వారానికే తన కొత్త చిత్రం ‘మృత్యుంజయ్’ వస్తుండడంతో దాని మీద ఆశలు పెట్టుకున్నాడు విష్ణు. ఈ సినిమాకు ఇండస్ట్రీ నుంచి మంచి బజ్ వచ్చింది.

సుకుమార్ శిష్యుడు రూపొందించిన సినిమా కావడం.. ఎన్టీఆర్ సహా చాలామందికి సన్నిహితుడైన సందీప్ గుణ్ణం ప్రొడ్యూస్ చేసి మూవీ కావడంతో నాని సహా చాలామంది ప్రముఖులు ఈ సినిమాకు సపోర్ట్ చేశారు. పాజిటివ్ పోస్టులు పెట్టారు. వాళ్లు చెప్పిన స్థాయిలో లేకపోయినా.. ‘మృత్యుంజయ్’ మంచి సినిమానే. థ్రిల్లర్ జానర్లో డీసెంట్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు హుస్సేన్ షా కిరణ్. ఈ చిత్రానికి ఎబోవ్ యావరేజ్ టాక్, రివ్యూలు వచ్చాయి.

ఐతే ఆ టాక్‌తో వీకెండ్ వరకు ఓ మోస్తరుగా వసూళ్లు సాధించింది కానీ.. తర్వాత నిలబడలేకపోయింది ‘మృత్యుంజయ్’. సంక్రాంతి సీజన్ తర్వాత మొదలైన స్లంప్ ఇప్పటికీ కొనసాగుతుండగా.. ‘మృత్యుంజయ్’ సైతం ఆ ట్రెండుకు బ్రేక్ వేయలేకపోయింది. ఇదే వీకెండ్లో వచ్చిన సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని, ఎస్.సరస్వతి మినిమం ఇంపాక్ట్ వేయలేకపోయాయి. శివాజీ సినిమాకు పూర్తిగా నెగెటివ్ టాక్ రాగా.. వరలక్ష్మి మూవీ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కినప్పటికీ జనాలకు అంతగా రుచించలేదు. అవి రెండూ వాషౌట్ అయిపోయాయి.

‘మృత్యుంజయ్’ వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుని అంతిమంగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గానే నిలిచింది. ఈ వీకెండ్లో ‘బ్యాండ్ మేళం’ అనే చిన్న సినిమా రావాల్సి ఉండగా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ నెల 26 నుంచి 19కి ప్రి పోన్ అయిన నేపథ్యంలో దీని రిలీజ్ డేట్ మార్చారు. మార్చి 26న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ వీకెండ్ కూడా బాక్సాఫీస్ వెలవెలబోతున్నట్లే. ‘ఉస్తాద్..’, ‘దురంధర్-2’ చిత్రాలు వచ్చాకే బాక్సాఫీస్‌కు ఊపిరి రాబోతోంది.