Begin typing your search above and press return to search.

అమీర్ లోగ్ కోసం రంగంలోకి శ్రీవిష్ణు.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో..

ఆయా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అమీర్ లోగ్ కోసం రంగంలోకి దిగారు.

By:  M Prashanth   |   10 Oct 2025 6:30 PM IST
అమీర్ లోగ్ కోసం రంగంలోకి శ్రీవిష్ణు.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో..
X

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కంటెంట్ తో ఆడియన్స్ ను ఎప్పుడూ అలరించే ఆ ఎంటర్టైన్మెంట్ కింగ్.. ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ సహా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఆయా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అమీర్ లోగ్ కోసం రంగంలోకి దిగారు.

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా మాధవి రెడ్డి సోమ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ ను మేకర్స్ విడుదల చేశారు. హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అమీర్‌ లోగ్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను శుక్రవారం లాంచ్ చేసిన అనంతరం శ్రీ విష్ణు మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

అయితే అమీర్‌ లోగ్ టైటిల్, పోస్టర్ చూస్తుంటే.. సినిమా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే ఓ కామెడీ కథగా తెలుస్తోంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సినిమా మొత్తం ఉండనుందని స్పష్టంగా అర్థమవుతుంది. స్నేహం చుట్టూ కేంద్రీకృతమై ఉన్న ఒక ఉత్సాహభరితమైన డ్రామాను పరిచయం చేస్తుంది. పోస్టర్‌ లో ముగ్గురు స్నేహితులు బైక్ రైడ్‌లో ఉన్నారు.

వారి ముగ్గురి ఎక్స్ప్రెషన్స్ ఉత్సాహం, ఆనందంతో నిండి ఉన్నాయి. పవర్ ఫుల్, హృదయపూర్వక కథనాన్ని సూచిస్తున్నాయి. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో హైదరాబాద్ నగరం యొక్క అద్భుతమైన ఐకానిక్ చార్మినార్ ప్రముఖంగా ఉంది. ఎడమ వైపు ఇరానీ చాయ్ అని రాసి ఉన్న బోర్డు కూడా కనిపిస్తుంది. కిందకు హైవే రోడ్డు ఉంది.

అయితే ఫస్ట్ లుక్ పోస్టర్.. అందరినీ ఆకట్టుకుని మెప్పిస్తోంది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఆసక్తి రేపుతోంది. స్నేహం, జ్ఞాపకాలు, అంతులేని వినోదంతో హైదరాబాద్ నడిబొడ్డున ఒక వైల్డ్ రైడ్‌bకు సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ పెట్టిన పోస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక మూవీ సినిమాటోగ్రఫీ SVK నిర్వహిస్తుండగా, స్మరన్ సాయి సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్‌ ను రోహిత్ పెనుమత్స పర్యవేక్షిస్తున్నారు.