Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.. కొత్త దర్శకులతోనే ఎందుకంటే..

టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీ విష్ణు. ఆయన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

By:  M Prashanth   |   6 Oct 2026 12:53 PM IST
శ్రీవిష్ణు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.. కొత్త దర్శకులతోనే ఎందుకంటే..
X

టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీ విష్ణు. ఆయన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా Tupaki.com కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్, సినిమా సెలక్షన్, వ్యక్తిగత విషయాలపై చాలా ఓపెన్ గా మాట్లాడారు.

కామ్రేడ్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే హిలేరియస్ ఎంటర్టైనర్ అని శ్రీ విష్ణు తెలిపారు. ఇలాంటి సెటప్ లో కామెడీ వర్కౌట్ చేయడం చాలా రేర్ అని, కథ వినగానే బాగా నచ్చి ఓకే చేశానని చెప్పారు. నాచురల్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారట. క్యారవాన్ లు వెళ్లే దారి లేకపోవడంతో రోజూ దాదాపు 30 నిమిషాలు అడవిలో నడుచుకుంటూ వెళ్లి షూటింగ్ చేయడం శారీరకంగా చాలా అలసిపోయేలా చేసిందని ఆయన గుర్తుచేసుకున్నారు.

కెరీర్ లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే ఎందుకు పనిచేస్తారు అన్న ప్రశ్నకు శ్రీ విష్ణు చాలా ప్రాక్టికల్ ఆన్సర్ ఇచ్చారు. పెద్ద దర్శకులతో చేస్తే సినిమా సేఫ్ గా ఉంటుంది కానీ, వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ఉండటం వల్ల ఆడియన్స్ కు ముందే ఒక అంచనా వచ్చేస్తుందని చెప్పారు. అదే కొత్త వాళ్ళతో చేస్తే సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటుందని, అందుకే ఫ్రెష్ టాలెంట్ కు ఎక్కువ అవకాశాలు ఇస్తుంటానని తన లాజిక్ వివరించారు.

సెట్స్ లో హీరోయిన్లతో పెద్దగా మాట్లాడరు, చాలా సైలెంట్ గా ఉంటారనే కామెంట్స్ పైనా ఆయన స్పందించారు. తాను మొదటి నుంచీ కొంచెం ఇంట్రవర్ట్ అని, ఆ విషయాన్ని సినిమా మొదలైనప్పుడే హీరోయిన్లకు, కో స్టార్స్ కు ముందే చెప్పేస్తానని క్లారిటీ ఇచ్చారు. అలా చెప్పకపోతే వాళ్ళు తన సైలెంట్ నేచర్ ను ఆటిట్యూడ్ అనుకునే ప్రమాదం ఉందని, అందుకే ముందుగానే కూల్ చేసి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తానని నవ్వుతూ చెప్పారు.

ఖాళీ దొరికితే సినిమాలు బాగా చూస్తానని చెబుతూ, రీసెంట్ గా వచ్చిన ఇరుముడి సినిమా తనకు చాలా నచ్చిందని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో పార్టీలు, ఫంక్షన్లకు దూరంగా ఉంటూ చాలా ప్రైవేట్ లైఫ్ లీడ్ చేసే శ్రీ విష్ణు, కామ్రేడ్ కళ్యాణ్ లో మాత్రం ఫన్ డోస్ పీక్స్ లో ఉంటుందని హామీ ఇచ్చారు. ఎమోషన్స్, సిచువేషనల్ కామెడీ కలగలిపిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తన సినిమాపై ఉన్న నమ్మకాన్ని బయటపెట్టారు.