Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణును తెలివిగా యూజ్ చేసుకున్నారే!

సినిమా విడుదలైన తర్వాత ఆ ఆసక్తి మరింత పెరిగింది. అయితే గాయపడ్డ సింహంలో శ్రీవిష్ణు పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

By:  M Prashanth   |   2 May 2026 2:57 PM IST
శ్రీవిష్ణును తెలివిగా యూజ్ చేసుకున్నారే!
X

టాలీవుడ్ లో నేచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో శ్రీవిష్ణు పేరు కచ్చితంగా ముందుంటుంది. కమర్షియల్ ఫార్ములా కంటే కథకు ఇంపార్టెన్స్ ఇచ్చే నటుడిగా ఆయన ఇప్పటికే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న పాత్రలు చేసిన ఆయన, తర్వాత తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.

సినిమాల్లోకి రాకముందు అండర్-19 ఆంధ్ర క్రికెట్ జట్టులో మెంబర్ గా ఉన్న శ్రీవిష్ణు, సినిమాలపై ఇంట్రెస్ట్ తో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. బాణం, సోలో వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించినా, ప్రేమ ఇష్క్ కాదల్ మూవీలో రాయల్ రాజు పాత్రతో మంచి గుర్తింపు సంపాదించారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. విభిన్న కథలు ఎంచుకోవడం, పాత్రలో పూర్తిగా లీనమవడం, డైలాగ్స్ నేచురల్ గా చెప్పడం.. శ్రీవిష్ణు స్ట్రెంత్స్.

హీరోగా చేస్తూనే కథకు అవసరమైన పాత్రలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అందుకే శ్రీవిష్ణు చేసిన సినిమాలు ఎక్కువగా కంటెంట్ ఆధారంగా ఉంటాయి. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన నారి నారి నడుమ మురారి సినిమాలో శ్రీవిష్ణు గెస్ట్ రోల్‌ లో కనిపించారు. ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గాయపడ్డ సింహం సినిమాలో ఆయన కీలక పాత్రలో నటించారు. ట్రైలర్‌ లోనే శ్రీవిష్ణు కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది.

సినిమా విడుదలైన తర్వాత ఆ ఆసక్తి మరింత పెరిగింది. అయితే గాయపడ్డ సింహంలో శ్రీవిష్ణు పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఉన్న యువకుడిగా, అలాగే క్షుద్ర విద్యలు చేసే మాంత్రికుడిగా కనిపించడం ద్వారా ఆయన తన నటనలో మరో కోణాన్ని చూపించారు. రెండు విభిన్న యాంగిల్స్ ను సరైన విధంగా మలచడం ఆయన యాక్టింగ్ టాలెంట్ కు పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ముఖ్యంగా సెకండాఫ్‌ లో, క్లైమాక్స్‌లో శ్రీవిష్ణు పాత్ర కథను ముందుకు నడిపించిన తీరు ప్లస్‌గా మారింది.

స్క్రీన్ పై ఆయన కనిపించే సమయం తక్కువే అయినప్పటికీ, ఆ ఎఫెక్ట్ మాత్రం గట్టిగా పడుతోంది. భైరవ దాస్ పాత్ర సినిమా చూసిన ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా ఉంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ పాత్ర ద్వారా పార్ట్-2కు మేకర్స్ మంచి లీడ్ ఇచ్చారు. పోరాట సింహంగా శ్రీవిష్ణు పాత్రను చూపిస్తూ కథను మరింత పెంచుతున్నట్లు సిగ్నల్ ఇచ్చారు. దీంతో సీక్వెల్‌ పై కూడా ఆసక్తి పెరిగింది.

ఏదేమైనా శ్రీవిష్ణును సినిమాలో యూజ్ చేసిన విధానం మేకర్స్ తెలివితేటలను చూపిస్తోంది. చిన్న పాత్ర అయినప్పటికీ కథలో కీలకంగా మలచడం, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేయడం సినిమాకు బిగ్ అసెట్ గా మారింది. ఇదే విషయాన్ని నెటిజన్లు చెబుతున్నారు. శ్రీవిష్ణు పాత్రే సినిమాకు హైలైట్, తక్కువ టైమ్‌ లో ఎక్కువ ఇంపాక్ట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే శ్రీవిష్ణు తన కెరీర్‌ లో మరో గుర్తుండిపోయే పాత్రను అందుకున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.