Begin typing your search above and press return to search.

'ఒరియా పిల్ల..' అంటున్న శ్రీవిష్ణు.. అదే మ్యాజిక్

భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

By:  M Prashanth   |   21 Jun 2026 9:26 AM IST
ఒరియా పిల్ల.. అంటున్న శ్రీవిష్ణు.. అదే మ్యాజిక్
X

భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌ తో ఆసక్తి పెంచిన ఆ చిత్రం, తాజాగా విడుదలైన తొలి పాట ఒరియా పిల్లతో మరింత బజ్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ వాయిస్ మరోసారి పాటను ప్రేక్షకుల హృదయాలకు దగ్గర చేసింది.

1992 నాటి ఆంధ్రా- ఒడిశా బోర్డర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. విలేజ్ లవ్ స్టోరీకి పొలిటికల్, సోషల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి రూపొందిస్తున్న ఆ సినిమా నుంచి విడుదలైన తొలి సాంగ్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ఒరియా పిల్ల సాంగ్ లో ప్రేమలో పడిన ఓ యువకుడి మనసులోని ఫీలింగ్స్ ను ఎంతో అందంగా చూపించారు. ఒడిశాకు చెందిన ఓ యువతిని చూసి ప్రేమలో పడిన వ్యక్తి ఆమె వెంట తిరిగే తీరును, ప్రేమలోని అమాయకత్వాన్ని లిరిక్స్ ద్వారా చూపించారు. భాస్కరభట్ల అందించిన వర్డ్స్ ఈజీగా అర్థమయ్యేలా ఉండటమే కాకుండా, పాటలోని ఎమోషన్స్ మరింత స్ట్రాంగ్ గా చెబుతున్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఆ పాటకు అందించిన స్వరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవలి కాలంలో మెలోడీ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈ పాటలో కూడా వినసొంపైన బాణీలు అందించారు. సాంగ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఓ స్మూత్ లవ్ ఎక్స్పీరియన్స్ కలిగించేలా కంపోజ్ చేశారు. కొన్ని చోట్ల కర్ణాటక మ్యూజిక్ స్టైల్ వినిపించడం పాటకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.

అయితే సాంగ్ లో మెయిన్ హైలైట్‌ గా నిలిచింది సిద్ శ్రీరామ్ వాయిస్. ప్రేమలో మొదటిసారి కలిగే ఆనందం, ఎగ్జైట్మెంట్ వంటి ఫీలింగ్స్ ను అద్భుతంగా పలికించారు. గతంలో ఎన్నో హిట్ మెలోడీలతో ప్రేక్షకులను అలరించిన సిద్ శ్రీరామ్, ఒరియా పిల్లతో మరోసారి తన మార్క్ చూపించారని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెస్పాన్స్ రావడం దానికి ఎగ్జాంపుల్.

విజువల్‌ గా కూడా పాట ఆకట్టుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసిన ఆ సాంగ్ లో శ్రీవిష్ణు కొత్త లుక్‌ లో కనిపించారు. పల్లెటూరి యువకుడి పాత్రలో ఒదిగిపోయారు. మహిమా నంబియార్ కూడా విలేజ్ గర్ల్ గా అందంగా కనిపించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. శ్రీవిష్ణు డ్యాన్స్ మూవ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఏదేమైనా ఒరియా పిల్ల.. అంటూ సాగుతున్న పాట కేవలం ప్రమోషనల్ సాంగ్‌ గా కాకుండా, కామ్రేడ్ కళ్యాణ్ లోని ప్రేమకథను క్లియర్ గా చెబుతోంది. సిద్ శ్రీరామ్ వాయిస్, హార్ట్ ను టచ్ చేసే లిరిక్స్, శ్రీవిష్ణు- మహిమా కెమిస్ట్రీ కలిసి పాటను చార్ట్‌ బస్టర్ గా మార్చాయనే చెప్పాలి. ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న కామ్రేడ్ కళ్యాణ్ పై పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.