కోమలమైన మోముతో బీచ్ ఒడ్డున ఆకట్టుకుంటున్న శ్రీ లీల!
ఇకపోతే ప్రస్తుతం తమ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మొన్నటి వరకు పలు ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేసిన ఈమె.. తాజాగా మరో కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
By: Madhu Reddy | 12 Jan 2026 9:30 AM ISTప్రముఖ కన్నడ బ్యూటీ శ్రీ లీల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందంతో, యావత్ సౌత్ ఆడియన్స్ ను అలరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ సరసన ఆషికీ3 అనే చిత్రంలో నటిస్తోంది. శ్రీ లీల ప్రస్తుతం శివ కార్తికేయన్ సరసన పరాశక్తి సినిమాలో నటించింది ఇదే ఆమెకు తొలి తమిళ్ చిత్రం కావడం గమనార్హం.. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి సందర్భంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కావాల్సి ఉండగా.. థియేటర్ల కొరత అలాగే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో ఆలస్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం జనవరి 23వ తేదీని పరిశీలనలో ఉంచారు మేకర్స్. మరి ఆరోజు విడుదలవుతుందా? లేదా? అన్నదానిపై క్లారిటీ లేదు. ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇకపోతే ప్రస్తుతం తమ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మొన్నటి వరకు పలు ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేసిన ఈమె.. తాజాగా మరో కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇకపోతే అలా పంచుకున్న ఆ ఫోటోలలో బీచ్ సైడ్ కోమలమైన మోముతో ప్రశాంత వాతావరణంలో ఆనందంగా విహరిస్తోంది. పర్పుల్ కలర్ శారీ అందుకు కాంబినేషన్లో పర్ఫెక్ట్ బ్లౌజ్ ధరించిన ఈమె.. తన అద్భుతమైన స్మైల్ తో అందరి హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా బీచ్ ఒడ్డున ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. శ్రీ లీల షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక శ్రీలీల ఇలా విషయానికి వస్తే.. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత రవితేజ ధమాకా సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ సినిమా తర్వాతే పలు చిత్రాలు చేసింది కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ లభించలేదు. ఇక పుష్ప2 సినిమాలో కిస్సిక్ అనే పాటకు స్పెషల్ సాంగ్ చేసి అలరించింది.
ఇకపోతే శ్రీలీల నిర్మాతల మనిషి అని పేరు దక్కించుకుంది. ఎందుకంటే సాధారణంగా ఒక సినిమాలో హీరోయిన్ నటిస్తోంది అంటే ఆమె హీరోయిన్ పాత్రకే పరిమితం అవుతుంది. స్పెషల్ సాంగ్ చెయ్యదు. దానికోసం వేరొక హీరోయిన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ శ్రీలీల తాను నటించే సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్ కూడా చేసి నిర్మాతలకు రెమ్యూనరేషన్ మిగిలిస్తోంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా శ్రీలీల ఎప్పటికప్పుడు తన మంచి మనసుతో అందరినీ ఆకర్షిస్తోంది అని చెప్పవచ్చు.
