వింటేజ్ లుక్ లో శ్రీలీల అందాలు.. ఆమెను గుర్తు చేసిందిగా!
ఇక కనీసం తమిళనాడులో అయినా విడుదల చేస్తారని అభిమానులు అనుకోగా.. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది.
By: Madhu Reddy | 9 Jan 2026 11:09 AM ISTశ్రీలీల హీరోయిన్ గా.. శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న చిత్రం పరాశక్తి. ఆకాశమే నీ హద్దురా, గురు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే రేపు థియేటర్లలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో గందరగోళం నెలకొంది.
దీనికి తోడు తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్, జనవరి 9న విడుదల అవ్వగా.. అటు జనవరి 12న చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోని తెలుగులో థియేటర్లు దొరక్కపోవడంతో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ నిలిపివేశారు. పైగా ఈనెల 23న విడుదల చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక కనీసం తమిళనాడులో అయినా విడుదల చేస్తారని అభిమానులు అనుకోగా.. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది.
ఇదిలా ఉండగా.. పరాశక్తి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమిళనాడులో నిన్న ఒక ఈవెంట్ నిర్వహించారు. అందులో శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వింటేజ్ లుక్ ను తలపిస్తూ.. బ్లాక్ సారీ , జడలో గులాబీ పువ్వుతో కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేసింది. ఇకపోతే వింటేజ్ లుక్ లో కనిపించిన శ్రీ లీలను చూసి దివంగత నటీమణి సావిత్రిని గుర్తు చేసింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే పరాశక్తి ఈవెంట్లో చాలా అందంగా ముస్తాబయి స్పెషల్ అట్రాక్షన్ గా అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీ లీల. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శ్రీ లీల సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది మాస్ మహారాజా రవితేజతో మరోసారి జతకట్టింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన ధమాకా సినిమా మంచి విజయాన్ని అందుకుంది.దీంతో కచ్చితంగా మాస్ జాతర సినిమా కూడా సక్సెస్ అవుతుందని అభిమానులు ఊహించారు. కానీ ఇది డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రం పరాశక్తి .ఇది తమిళ్ మూవీ. అలాగే తెలుగులో డబ్బింగ్ వెర్షన్లో విడుదల కాబోతోంది.
మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో 13 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఈమె హిందీలో కూడా ఆషికి 3లో నటిస్తోంది. మొత్తానికైతే వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న శ్రీలీలకి ఈ చిత్రాలు ఎలాంటి సక్సెస్ ను అందిస్తాయో చూడాలి.
