గ్రౌండ్ లో సందడి చేసిన శ్రీలీల..
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సినిమా ఈవెంట్ల కంటే కూడా పబ్లిక్ తో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో బ్యూటీ పబ్లిక్ లో కనిపించి సందడి చేసింది.
By: Madhu Reddy | 20 Dec 2025 5:46 PM ISTఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సినిమా ఈవెంట్ల కంటే కూడా పబ్లిక్ తో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో బ్యూటీ పబ్లిక్ లో కనిపించి సందడి చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా బెంగళూరు వేదికగా వరల్డ్ టెన్నిస్ లీగ్ జరుగుతుండగా అక్కడికి వచ్చి అందరిని మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా అభిమానుల కోలహాలాల మధ్య బాడీగార్డ్స్ సహాయంతో గ్రౌండ్ లోకి విచ్చేసింది శ్రీ లీల..
బ్లూ అండ్ వైట్ కలర్ మినీ మిడ్డీను తలపించేలా డ్రెస్ ధరించి తన అందాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కళ్లజోడను తలపైకి పెట్టి స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్న తీరుకి అభిమానులు ఫిదా అయిపోయారు. ముంబై నుంచి వచ్చారా అని కొంతమంది కెమెరామెన్ లు అడగగా.. వెల్కమ్ టు బెంగళూర్ అంటూ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది. మొత్తానికైతే గ్రౌండ్లో కి ఎంటర్ అయ్యి అక్కడి అభిమానులలో సరికొత్త జోష్ ను నింపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
శ్రీ లీల విషయానికొస్తే.. ఇటీవల మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల అవకాశాన్ని అందుకుంది. శ్రీ లీలతో పాటు మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని అడవులలో జరుగుతోంది. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా పూర్తి కాబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాతో పాటు శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి అనే సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ఈ సినిమా ద్వారానే తమిళంలోకి కూడా అడుగుపెడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రానికి ఆకాశమే నీ హద్దురా, గురూ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది. ఇందులో జయం రవి, అధర్వ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5 సొంతం చేసుకుని.. సుమారుగా 52 కోట్ల రూపాయలకు ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం.
