చరణ్ - తారక్.. ఇద్దరితో ఒకేసారి ఛాన్స్ వస్తే..
కానీ ఒకరితో వర్క్ చేయాలనుకుంటే మరొకరి ప్రాజెక్ట్ కచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది ఏ హీరోయిన్ కు అయినా అగ్నిపరీక్ష.
By: M Prashanth | 26 Aug 2025 11:59 AM ISTటాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్.. ఆర్ఆర్ఆర్ కు ముందు.. ఆ తర్వాత.. అన్నట్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరూ క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమాలో తమ యాక్టింగ్ తో అందరినీ అలరించారు. పలు అవార్డులు అందుకున్నారు.
ఇప్పుడు తమ అప్ కమింగ్ సినిమాలతో ఇద్దరూ బిజీగా ఉన్నారు. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనాతో పెద్ది మూవీ చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అదే సమయంలో తారక్.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీని పూర్తి చేస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా.. ఎన్టీఆర్ పై భారీ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారని సమాచారం. అలా చెర్రీ, తారక్ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరితో ఓ హీరోయిన్ కు అయినా ఒకేసారి ఛాన్స్ రావడమంటే సాధారణమైన విషయం కాదు కదా. ఇద్దరూ బడా హీరోలు కాబట్టి సూపర్ ఛాన్స్ లనే చెప్పాలి.
కానీ ఒకరితో వర్క్ చేయాలనుకుంటే మరొకరి ప్రాజెక్ట్ కచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది ఏ హీరోయిన్ కు అయినా అగ్నిపరీక్ష. ఒకవేళ ఇదే సీన్ రిపీట్ అయితే ఏం చేస్తావ్ అని అడిగితే.. ఇప్పుడు యంగ్ బ్యూటీ శ్రీలీల ఓ షోలో ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు.
సీనియర్ హీరో జగపతిబాబు జయమ్ము నిశ్చయమ్మురా షోలో తాజాగా హీరోయిన్ శ్రీలీల సందడి చేసిన సంగతి తెలిసిందే. తన తల్లి స్వర్ణలతతో కలిసి వచ్చింది. కెరీర్, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడంతో పాటు జగ్గు భాయ్ తో మామూలు అల్లరి చేయలేదు. ఇప్పుడు ఆ ఎపిసోడ్.. ఆదివారం రాత్రి నుంచి జీ5 స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే ఆ సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకేసారి అవకాశాలు ఇస్తే.. ఒకేసారి కాల్షీట్లు అడిగితే, ఎవరికి ఫస్ట్ కాల్షీట్ ఇస్తావని జగ్గూ భాయ్.. శ్రీలీలను అడిగారు. అప్పుడు ఆమె.. ఇద్దరు హీరోల కోసం రెండు షిఫ్టులు పని చేస్తానని తెలిపింది. అంటే ఏ మూవీని కూడా వదులుకోనని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో అందం, అభినయం, డ్యాన్సే కాదని.. మాటల్లో కూడా అమ్మడికి ఫుల్ టాలెంట్ ఉందని అంతా కామెంట్లు పెడుతున్నారు.
