Begin typing your search above and press return to search.

లీల‌మ్మ‌కు మ‌రో బంప‌రాఫ‌ర్.. పాన్ ఇండియా మార్కెట్ పై క‌న్నేసిందా?

శ్రీలీల ఈ ఇయ‌ర్ సంక్రాంతికి రిలీజైన ప‌రాశ‌క్తి మూవీతో కోలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌య్యారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 Feb 2026 4:00 PM IST
లీల‌మ్మ‌కు మ‌రో బంప‌రాఫ‌ర్.. పాన్ ఇండియా మార్కెట్ పై క‌న్నేసిందా?
X

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో వేగంగా ఎదుగుతున్న హీరోయిన్ల లిస్ట్ లో శ్రీలీల పేరు ఇప్పుడు స్పెష‌ల్ గా వినిపిస్తోంది. ఒకే భాషకు పరిమితం కాకుండా, తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో సమాంతరంగా అవకాశాలు అందుకోవడం.. ఆమె కెరీర్‌ను పాన్ ఇండియా దిశగా నడిపిస్తున్న వ్యూహాత్మక నిర్ణయంగా పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప‌రాశ‌క్తితో కోలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన శ్రీలీల‌

శ్రీలీల ఈ ఇయ‌ర్ సంక్రాంతికి రిలీజైన ప‌రాశ‌క్తి మూవీతో కోలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌య్యారు. త‌న మొదటి సినిమా ప‌రాశ‌క్తి రిలీజ్ కంటే ముందే శ్రీలీల రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సైన్ చేయ‌డం విశేషం. అందులో కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ హీరోగా రూపొందుతున్న D55 ఒక‌టి కాగా, ఈ సినిమాకు అమ‌ర‌న్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియ‌సామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ధృవ్ విక్ర‌మ్ తో శ్రీలీల మూవీ

ధ‌నుష్ మూవీతో పాటూ చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్ర‌మ్ స‌ర‌స‌న కూడా శ్రీలీల ఓ సినిమాకు సైన్ చేశారు. యంగ్ హీరోల‌తో పాటూ ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని, మార్కెట్ లో త‌న స్థానాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌ని శ్రీలీల ప్ర‌య‌త్నిస్తున్నట్టు క్లియ‌ర్ గా అర్థ‌మ‌వుతుంది. ఆల్రెడీ కోలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవ‌కాశాన్ని అందుకున్న లీలకు ఇప్పుడు మ‌రో బంప‌రాఫ‌ర్ అందిన‌ట్టు తెలుస్తోంది.

అజిత్ మూవీలో ఆఫ‌ర్ కొట్టేసిన శ్రీలీల‌

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న AK64లో శ్రీలీల ఎంపికైన‌ట్టు తెలుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ త‌ర్వాత అజిత్- అధిక్ ర‌విచంద్ర‌న్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై మంచి అంచ‌నాలున్నాయి. అనిరుధ్ సంగీతం అందించ‌నున్న ఈ సినిమాను అనిల్ సుంక‌ర నిర్మించ‌నుండ‌గా, చిత్ర షూటింగ్ ఈ నెల‌లోనే మొద‌ల‌వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపిక‌వ‌డం, ఆమె మార్కెట్ విలువ పెరిగింద‌న‌డానికి నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. ఓ వైపు యంగ్ హీరోల‌తో సినిమాలు చేస్తూనే, మ‌రోవైపు సీనియ‌ర్ స్టార్ హీరోల సినిమాల‌ను బ్యాలెన్స్ చేయ‌డం చూస్తుంటే శ్రీలీల ఏదో చాలా భారీగానే ప్లాన్ చేసిన‌ట్టు అనిపిస్తోంది.

తెలుగులో ఇప్ప‌టికే మ‌హేష్ బాబు తో క‌లిసి గుంటూరు కారంలో న‌టించిన శ్రీలీల‌, ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ చేశారు. ఈ మూవీ మార్చి 26న రిలీజ్ కానుంది. టాలీవుడ్ స్టార్ హీరోల స‌ర‌స‌న ఛాన్సులు కొన‌సాగుతుండ‌గా, కోలీవుడ్ లో కూడా శ్రీలీల స్ట్రాంగ్ లైన‌ప్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. వీటితో పైగా ఈ ఏడాదిలోనే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్ట‌నున్నారు శ్రీలీల‌. మూడు భాష‌ల్లో స‌మాంత‌రంగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్ లో త‌న మార్కెట్ ను విస్త‌రించేలా చేయాల‌ని అమ్మ‌డు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.