Begin typing your search above and press return to search.

కవర్ పేజ్ కోసం శ్రీలీల గ్లామర్ లుక్.. లండన్ బ్రిడ్జిపై హొయలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతోనే కాదు నటనతో కూడా అందరినీ కట్టిపడేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

By:  Madhu Reddy   |   25 Oct 2025 11:50 AM IST
కవర్ పేజ్ కోసం శ్రీలీల గ్లామర్ లుక్.. లండన్ బ్రిడ్జిపై హొయలు!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతోనే కాదు నటనతో కూడా అందరినీ కట్టిపడేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అమాయకపు మోముతో అందమైన చిరునవ్వుతో ఎంతోమంది కుర్రకారును తన వశం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా ఒక కవర్ పేజీ కోసం లండన్ బ్రిడ్జిపై హొయలు పోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


విషయంలోకి వెళ్తే.. గ్రాజియా కవర్ పేజీ కోసం లండన్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. బ్లాక్ లెదర్ టాప్ పై బ్లాక్ జాకెట్టు ధరించిన ఈమె తన కాన్ఫిడెంట్ లుక్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా బ్లాక్ ఫజి జాకెట్ ధరించిన ఈమె షార్ట్ స్కర్ట్ ధరించి తన కూల్ లుక్కుతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీ లీలా షేర్ చేసిన ఈ బ్లాక్ అవుట్ ఫిట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు అభిమానుల హృదయాలు కూడా దోచుకుంటున్నాయని చెప్పవచ్చు.




ఇదిలా ఉండగా ఇటీవలే శ్రీ లీల ప్రముఖ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన 100కోట్ల యాడ్ "చింగ్స్ దేశీ చైనీస్" అనే బ్రాండ్ వాణిజ్య ప్రకటన కోసం రణవీర్ సింగ్ , బాబీ డియోల్ తో కలిసి పనిచేసింది శ్రీ లీల. ఈ వాణిజ్య ప్రకటన కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. అలా ఈ యాడ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు రవితేజ తో కలిసి 'మాస్ జాతర' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకే రవితేజ, శ్రీ లీలా కాంబినేషన్లో 'ధమాకా' సినిమా వచ్చి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి ఈ కాంబినేషన్లో సినిమా రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించారు.




ఈ చిత్రంతోపాటు 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమాలో కూడా నటిస్తోంది శ్రీ లీల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రాశిఖన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న 'పరాశక్తి' అనే తమిళ రాజకీయ నాటక చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్, రవి మోహన్ , అథర్వ, శ్రీ లీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే హిందీలో కార్తీక్ ఆర్యన్ తో కూడా ఒక సినిమా చేస్తోంది శ్రీ లీల. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి అయితే వరుస సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.